రేవంత్ సూట్ కేస్ దొంగ

talasani alleges Revanth is a money bags carrier of telugu desam party
Highlights

  • సూట్ కేస్ తో దొరికిన దొంగవు
  • కొడంగల్ లో నీకు గుణపాఠం తప్పదు

టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి మీద తెలంగాణ పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు.  సూట్ కేస్ ఇచ్చి దొంగలా పట్టుబడిన రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి తలసాని విమర్శించారు. దొంగ పని చేసి రేవంత్ రెడ్డి కోడంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేదా అని ప్రశ్నించారు. కోడంగల్ లో గొల్లకుర్మలను కించపరిచే విధంగా మాట్లాడితే ఇచ్చడి ప్రజలు తరిమి కొడుతారని హెచ్చరించారు. కొడంగల్ లో 70 లక్షల నిధులతో  రైతు శిక్షణ  కేంద్రం, పశు వ్యాధి నిర్థారణ కేంద్రం ప్రారంభించారు మంత్రి తలసాని. ఈ కార్యక్రమంలో కేబినెట్ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ గురునాథరెడ్డి పాల్గొన్నారు.

నీకు ఆ దమ్ముందా రేవంత్ ? : మంత్రి పట్నం

ఈ సందర్భంగా పట్నం మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కోడంగల్ నియోజకవర్గం లో 4250 మంది కుర్మలకు గొర్రెలను మంజూరు చేసి తొలి విడతలో 2300 మందికి అందించే క్రమంలో ఇప్పటికీ 560 యూనిట్ లు అందించామన్నారు.

రేవంత్ చూపిన నిర్లక్ష్యం లో కోడంగల్ లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదల దరి చేరలేదని ఆరోపించారు. రేవంత్ తనను ఓడించేందుకే కోడంగల్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పటం సిగ్గుచేటన్నారు. రేవంత్ మాటల గారడి తో ప్రజలను మభ్యపెట్టడం తప్ప వారిని పట్టించుకొన్న పాపాన పోలేదన్నారు. నోటికి హద్దులేకుండా మాట్లాడడం మానుకోవాలన్నారు. దమ్ముంటే రాజీనామా చేసీ ప్రజల తీర్పు కోరాలని సవాల్ చేశారు.

 

loader