హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

కోడెలను మానసికంగా ఇబ్బంది పెట్టింది చంద్రబాబు నాయుడేనని స్పస్టం చేశారు. కోడెలను పార్టీ సమావేశాలకు దూరంగా పెట్టడం, చివరకు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన తనవు చాలించి ఉంటారన్నారు. 

చంద్రబాబు చేసినవన్నీ చేసేసి తప్పంతా జగన్ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వం కేసులు పెట్టినా ఏనాడు సోదాలు చేయలేదన్నారు.  దర్యాప్తు పేరిట హింసించిన దాఖలాలు కూడా లేవన్నారు. 

కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబు దండాలు పెడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఎన్ని రాజకీయ డ్రామాలు ఆడినా చంద్రబాబు నాయుడను ప్రజలు నమ్మరని తలసాని స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల ధైర్యవంతుడు, ఆత్మహత్యకు పాల్పడటం ఆశ్చర్యంగా ఉంది: జీవీఎల్

గవర్నర్ బీబీ హరిచందన్ తో చంద్రబాబు భేటీ: కోడెల మరణం, రాజకీయ దాడులపై ఫిర్యాదు