Asianet News TeluguAsianet News Telugu

బ్యూటీషియన్ శిరీష కేసులో రంగంలోకి దిగిన బిటి మంత్రి

బ్య్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయా? అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్న కీలక నిందితుడు వల్లభనేని రాజీవ్ ను సేఫ్ చేసేందుకు రాజకీయ నేతలు రంగంలోకి దిగారా? వల్లభనేని రాజీవ్ ను రక్షించడం కోసం ఒక బిటి మంత్రి, మరో బిటి ఎమ్మెల్యే పావులు కదులుపుతున్నారా?  అంటే అవుననే సమాధానం వస్తోంది.

T ministers trying to bail out rajeev in beautician sireesha case

శిరీష ఆత్మహత్య, వెంటనే ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఈ రెండు ఆత్మహత్యలు ఒకదానికి మరొకటి ఇంటర్ లింక్ అయి ఉన్నాయి. శిరీష ఆత్మహత్య కారణంగానే ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య జరిగిందని పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నారు. మరి శిరీష ఆత్మహత్యకు కారకుడైన వల్లభనేని రాజీవ్ ను రక్షించేందుకు రాజకీయ పక్షులు రంగంలోకి దిగాయి.

 

ప్రస్తుతం కేసును బంజారాహిల్స్ పోలీసులు డీల్ చేస్తున్నారు. వల్లభనేని రాజీవ్ ను ఈ కేసులోంచి రక్షించేందుకు తెలంగాణ మంత్రివర్గంలోని ఒక మంత్రిని రాజీవ్ బంధువులు అప్రోచ్ అయినట్లు తెలిసింది. ఆ మంత్రితోపాటు హైదరాబాద్ కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం అందుతోంది. వీరిద్దరూ కలిసి కేసును నీరుగార్చేందుకు, వల్లభనేని వంశిని సేఫ్ చేసేందుకు తమదైన శైలిలో పోలీసులపై వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

తెలంగాణలో బిటి అనే పదం బాగా పాపులర్ అయింది. బిటి బ్యాచ్ గా కొంతమంది పేర్లు బాగా ప్రచారంలోకి వచ్చాయి. బిటి అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిటి మంత్రి అంటే బంగారు తెలంగాణ మంత్రి అని, బంగారు తెలంగాణ ఎమ్మెల్యే అని చెబుతున్నారు. మరి వారిద్దరికీ ఎందుకు వల్లభనేని రాజీవ్ ను రక్షించాలసిన  అవసరం వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

 

వల్లభనేని రాజీవ్ బంధువులకు, బిటి మంత్రి, బిటి ఎమ్మెల్యేకు మధ్య మంచి సంబంధాలున్నాయని, అందుకే వారు ఈ ఇద్దరు నేతలను అప్రోచ్ అయ్యారని చెబుతున్నారు. దీంతో నిందితుడైన వల్లభనేని రాజీవ్ ను వారు రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.

 

మరి బిటి మంత్రి, బిటి ఎమ్మెల్యే పలుకుబడి ఏమేరకు సాగుతుందో? వారి వత్తిడి పోలీసుల మీద ఏమేరకు పనిచేస్తుందో? ఈ కేసులోంచి వల్లభనేని రాజీవ్ బయపటడతాడా అన్నది తెలంగాణ పోలీసుల విచారణలో తేలే అవకాశం ఉంది. పరిణామాలు చూస్తుంటే మాత్రం బిటి బ్యాచ్ పలుకుబడి గట్టిగానే పనిచేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios