తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి సీనియర్లు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. జగ్గారెడ్డి ఎపిసోడ్ సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ మారుతానంటూ బాంబు పేల్చడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో రేపు సీనియర్ నేతలంతా సమావేశం కానున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతానంటూ వ్యాఖ్యానించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి లొల్లి మొదలైంది. పార్టీలో పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్లు (t congress senior leaders) రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. పార్టీలో అసంతృప్తితో వున్న నాయకులకు ఆహ్వానం పంపించారు నేతలు. ఈ నెల 22న ఢిల్లీకి వీహెచ్ వెళ్లనున్నారు. అధిష్టానం అపాయింట్‌మెంట్ కోసం వీహెచ్ (v hanumantha rao) ప్రయత్నాలు చేస్తున్నారు. సోనియా , రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరానని... రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారొద్దని చెప్పానని వీహెచ్ అన్నారు. పాత కాంగ్రెస్ నేతలంతా బయటకు పోతే.. పార్టీ దెబ్బతింటుందని వీహెచ్ అన్నారు.
అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) భేటీ అయ్యారు. అవమానం జరిగే చోట వుండలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ మారడంపై నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి అన్నారు. పార్టీలో వున్న సమస్యలపై కలిసి మాట్లాడుకుందామని.. లేనిపక్షంలో అధిష్టానం వద్దకు వెళదామని వీహెచ్ అన్నట్లుగా తెలుస్తోంది.
కాగా.. గత బుధవారం నాడు Komatireddy Rajagopal Reddy చౌటుప్పల్ లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవం ఇవ్వని చోట తాను పార్టీలో ఉండనని చెప్పారు. ఎవరి కింద పడితే వారి కింద పని చేయలేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారితే తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చని కూడా ఆయన పిలుపునిచ్చారు.
KCR ను గద్దె దించడం కోసమే పార్టీ మారుతానని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేసే పార్టీ ఏదైతే ఆ పార్టీలో ఉంటానని చెప్పారు.. Congress పార్టీ గట్టిగా TRS కు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని భావిస్తే మరో పార్టీలోకి పోతామన్నారు. తాము పదవుల కోసం, డబ్బుల కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అవసరమైతే తామే నిలబడుతామని ఆయన చెప్పుకొచ్చారు.
స్వార్ధం కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఆయన.. ప్రజల కోసం త్యాగం చేస్తామన్నారు. తాను పార్టీ మారాలనుకొంటే ప్రజలతో చెప్పి మరీ పార్టీ మారుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ పదవుల కు కూడా resign చేస్తానన్నారు. మరో వైపు తాను తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను బీజేపీలో చేరుతున్నామని చెప్పామా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నా కూడా పార్టీ లో కొనసాగుతున్న తమను పార్టీకి దూరం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
ఇకపోతే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కాంట్రాక్టర్ అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో సీఎల్పీ.. తనకు సరైన మద్దతు ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం రాజీనామా చేస్తానంటూ ప్రకటించడంతో వీహెచ్ సహా పలువురు పెద్దలు ఆయనను బుజ్జగించారు.
