సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. 

తొలిసారిగా సర్వసభ్య సమావేశానికి హాజరైన హరీష్ రావును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. సంగారెడ్డి అభివృద్ధికి సహకరించాలని కోరారు. 

ఇకపోతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరీష్ రావును కలిశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సుమారు 14 ఏళ్ల అనంతరం తొలిసారిగా హరీష్ తో మాట  కలిపారు జగ్గారెడ్డి. నియోజకవర్గంలో సమస్యలపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని, ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు సర్వసభ్య సమావేశంలో స్పష్టం చేశారు. ఆర్థిక మాంద్యం వలన ఇతర ఖర్చులు, కేటాయింపులు తగ్గించామన్నారు. కానీ సంక్షేమ కార్యక్రమాలను మాత్రం యధావిధిగా కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. 

దేశం మొత్తం ఆర్థిక మాంద్యం ఉందని, కేంద్ర ప్రభుత్వం రోజుకోక దాంట్లో కోతలు పెడుతుందని విమర్శించారు. కానీ కేసీఆర్ మాత్రం సంక్షేమ పథకాల విషయంలో మాంద్యాన్ని లెక్క చేయలేదని తెలిపారు.

 సంగారెడ్డి జిల్లాలో రైతు బీమా పొందిన రైతులు ఏ విధంగా చనిపోయారో సవివివరంగా నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు గొప్ప పథకాలు అంటూ మంత్రి హరీష్ రావు కొనియాడారు. 

ఈ వార్తలు కూడా చదవండి

హరీష్‌రావుతో జగ్గారెడ్డి భేటీ: అసలు కథ ఇదీ....

హరీష్‌తో నెయ్యమే, రేవంత్ రెడ్డి చెడగొట్టుకొన్నాడు: జగ్గారెడ్డి

14 ఏళ్ల తర్వాత హరీష్ తో జగ్గారెడ్డి భేటీ: మతలబు ఏమిటి?