హైదరాబాద్:ఇక నుండి  మంత్రి హరీష్ రావుతో తాను ఘర్షణ పెట్టుకోనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే.

శుక్రవారం నాడు జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. సంగారెడ్డిలో హరీష్ రావు ప్రచారం చేసినా కూడ తనకు అభ్యంతరం లేదన్నారు. ఎవరి ప్రచారం వారిదేనని ఆయన చెప్పారు. 

అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి అభివృద్దిని చేయాలనేది తన తాపత్రాయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.

రేవంత్ రెడ్డి అనవసరంగా చెడగొట్టుకొంటున్నాడని  జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ స్థాయిలో పెరిగిన గ్రాఫ్ ను  ఏదో మాట్లాడి చెడగొట్టుకొంటున్నాడన్నారు.హుజూర్ నగర్ ఉప ఎన్నికల విషయమై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

14 ఏళ్ల తర్వాత హరీష్‌రావుతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు.కొన్ని రోజుల క్రితం హరీష్ రావుపై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.జగ్గారెడ్డి హరీష్ రావుతో భేటీ కావడంతోపాటు ఆయనతో వైరం ఉండదని ప్రకటించడం కూడ చర్చకు దారితీసింది.

సంబంధిత వార్తలు

14 ఏళ్ల తర్వాత హరీష్ తో జగ్గారెడ్డి భేటీ: మతలబు ఏమిటి?