హరీష్‌రావుతో జగ్గారెడ్డి భేటీ: అసలు కథ ఇదీ....

First Published 26, Sep 2019, 8:29 AM

సంగారెడ్డి ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.అయితే అధికార పార్టీ నేతలు ప్రసన్నం చేసుకొనేందుకు గాను జగ్గారెడ్డి పాత ఘటనలను మర్చిపోయి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. 

శతృత్వాన్ని వదిలిపెట్టి 14 ఏళ్ల తర్వాత మంత్రి హరీష్ రావుతో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి( జగ్గారెడ్డి) భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే దీని వెనుక పెద్ద కథే ఉందని ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డి తనదైన ముద్ర వేశారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో జగ్గారెడ్డి తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో కూడ టీఆర్ఎస్ ను ఎదుర్కొని ధీటుగా విమర్శలు చేయడంలో జగ్గారెడ్డి ముందు వరుసలో నిలిచాడు.

సంగారెడ్డి నియోజకవర్గంలో కార్యక్రమాల నిర్వహణకు టీఆర్ఎస్ నేతలు కొన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు.జగ్గారెడ్డి కూడ తన నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ ను కాపాడుకోవడంలో ముందుంటాడు.

2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో జగ్గారెడ్డి సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.ఈ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు.ఈ వాగ్దానాలను అమలు చేయడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. కానీ, ఈ ప్రతిపాదనల్లో ఎలాంటి కదలిక లేదు.

తాను ప్రభుత్వానికి ప్రతిపాదించిన అంశాలకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను కలవాలని జగ్గారెడ్డి ప్రయత్నాలు చేసినట్టుగా ప్రచారంలో ఉంది. అయితే సీఎం కేసీఆర్ నుండి అపాయింట్ మెంట్ దక్కలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

తాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటే ప్రభుత్వం నుండి నిధులను మంజూరు చేయించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు జగ్గారెడ్డికి నెలకొన్నాయి. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు.

30 నిమిషాల పాటు మంత్రి హరీష్ రావుతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు.నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి తాను పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న విషయాన్ని హరీష్ రావు దృష్టికి జగ్గారెడ్డి తీసుకొచ్చారు.

ఈ పనుల ప్రారంభానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని జగ్గారెడ్డి హరీష్ రావును  కోరినట్టుగా సమాచారం. ఈ విషయమై హరీష్ రావు కూడ సానుకూలంగా స్పందించినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

దీనికి తోడు రాజకీయంగా విమర్శలు చేస్తాను కానీ, వ్యక్తిగత విమర్శలు చేయనని కూడ హరీష్ రావుకు జగ్గారెడ్డి ఈ సందర్భంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కానీ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించాలంటే గతంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

హరీష్ రావుతో పాటు అధికార పార్టీతో మంచి సంబంధాలను కొనసాగిస్తే తన నియోజకవర్గానికి నిధులను తెచ్చుకోవచ్చనే అభిప్రాయంతో జగ్గారెడ్డి ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే హరీష్ రావుతో జగ్గారెడ్డి భేటీ అయ్యారని  అంటున్నారు.

తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించుకోవడం కోసం హరీష్ రావుతో పాటు టీఆర్ఎస్ నాయకత్వంపై కొంత సానుకూలంగా ఉన్నట్టుగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం లో ఉంది.

loader