‘కమలం’లో చిచ్చుపెట్టిన సోషల్ మీడియా పోస్టులు.. నాంపల్లి ఆఫీసులోనే ఈటల, బండి వర్గీయుల పరస్పర దూషణలు..
తెలంగాణ బీజేపీలో కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ అనుచరులు ఒకరినొకరు దూషించుకున్నారు. నాంపల్లి ఆఫీసులో చోటు చేసుకున్న ఈ పరిణామంతో వర్గ పోరు బయటపడింది.
తెలంగాణ బీజేపీలో వర్గ పోరు బయటపడింది. హుజారాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వర్గీయులు ఒకరినొకరు దూషించుకున్నారు. నాంపల్లి ఆఫీసులోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
అత్యాచార బాధితురాలిని బిడ్డకు జన్మనివ్వాలని బలవంతం చేయరాదు - అలహాబాద్ హైకోర్టు
ఇటీవల బండి సంజయ్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే దాని కంటే కొంత కాలం ముందు నుంచే ఆయనను పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం సోషల్ మీడియాలో ఒకరికొకరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఇవి రెండు వర్గాల మధ్య విభేదానికి నాంది పలికాయి. ఈటలను కించపర్చే విధంగా పోస్టులున్నాయంటూ ఆయన వర్గీయులు అసహనం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం.. ఏమిటీ అవార్డు ? దాని ప్రత్యేకతలేంటంటే ?
హైదరాబాద్ లోని నాంపల్లి ఆఫీసులో తాజాగా పదాధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ ఛార్జిల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఈటల వర్గీయులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ను కించపరుస్తూ, ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియా ప్రతినిధులను నిలదీశారు.
దీంతో బండి సంజయ్, ఈటల రాజేందర్ అనుచరులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ లో ఉద్యోగం నిర్వహించే ఒకరిని దూషించారు. ఓ క్రమంలో సోషల్ మీడియా గదికి లాక్ వేసి, ఆ ఉద్యోగిపై దాడి చేసేందుకు ప్రయత్నం జరిగిందని సమాచారం. దీంతో అక్కడే ఉన్న ఆఫీసు సిబ్బంది రెండు వర్గాలకు నచ్చజెప్పారు. వారిని శాంతింపజేశారు. దీంతో వివాదం చల్లబడింది.