Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల ఆంక్షలు.. స్విగ్గీ, జొమాటో బాయ్స్ ఆందోళన..!

నిన్నటి వరకు కొరియర్స్, స్విగ్గీ, జొమాటో లాంటి సర్వీసులకు ఫుడ్ డెలివరీ చేయడానికి అనుమతి ఇఛ్చారు. ఈ అనుమతులపై ఈరోజు నుంచి ఆంక్షలు విధించారు. ఆర్డర్స్ డెలివరీ చేయడానికి వస్తున్న డెలివరీ బాయ్స్ ని పోలీసులు అడ్డుకున్నారు.

Swiggy and zomato Food delivery boys protest in hyderabad
Author
Hyderabad, First Published May 22, 2021, 2:56 PM IST

తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినం చేశారు. ఉదయం ఆరుగంటల నుంచి పది గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తూ.. మిగిలిన సమయంలో లాక్ డౌన్ కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే..  నిన్నటి వరకు కొరియర్స్, స్విగ్గీ, జొమాటో లాంటి సర్వీసులకు ఫుడ్ డెలివరీ చేయడానికి అనుమతి ఇఛ్చారు. ఈ అనుమతులపై ఈరోజు నుంచి ఆంక్షలు విధించారు. ఆర్డర్స్ డెలివరీ చేయడానికి వస్తున్న డెలివరీ బాయ్స్ ని పోలీసులు అడ్డుకున్నారు.

నగర వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో బాయ్స్ వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఎల్బీ నగర్, ఖైరతాబాద్, ప్యాట్నీ చౌరాస్తా పలు ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ఫుడ్ డెలివరీ కోసం వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నారని వాపోయారు. డెలివరీ ఆపేయాలని తమ సంస్థల నుంచి సమాచారం లేదని పోలీసులకు చెప్పినా వినడం లేదని అంటున్నారు. 

ముందుగా సమాచారం ఇస్తే తాము రోడ్ల మీదకు వచ్చే వాళ్ళమే కాదని... అనవసరంగా తమను ఇబ్బందుల పాల్జేస్తున్నారని చెబుతున్నారు. కనీసం నీళ్లు కూడా లేవని రెండు మూడు గంటల నుంచి రోడ్లపైనే ఉన్నామని డెలివరీ బాయ్స్ అంటున్నారు. మరోవైపు పోలీసులు మాట్లాడుతూ.. ఆర్డర్ లేకుండా వెళ్తున్న ఫుడ్ డెలివరీ వాహనాలను మాత్రమే సీజ్ చేస్తున్నామని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios