పరిపూర్ణనంద స్వామి సీరియస్

పరిపూర్ణనంద స్వామి సీరియస్

మను ధర్మ శాస్త్రం పుస్తకాలను తగులబెట్టడంపై గురువు పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతమాత చిత్రపటం, మనుస్మృతి పుస్తకాన్ని తగులపెట్టడం తగదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టారీతిన వ్యవహరించడం తగదని చురకలంటించారు. పుస్తకాలను తగులబెట్టే వారికి మస్తకం (మెదడు) లేనట్లే అని ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో పరిపూర్ణానంద ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.

మన జీవన విధానం, కాలగమనం ఏ విధంగా ఉండాలనేది పూర్వీకులు నిర్ణయించారు. చాలా దేశాలకు రాత్రి పగలు, వేసవి, వర్ష, శీతాకాలాలు  సమానంగా ఉండవు. కానీ మన దేశంలో అన్ని సమాన స్థాయిలో ఉంటాయి. తెలుగు వారికి ఉగాది ప్రత్యేకం. వసంత కాలంలో కోకిల కూస్తుంది. సృష్టి యొక్క ఆరంభం ఉగాది రోజు జరిగిందని పూర్వీకులు తెలిపారు.

యంత్రాలు, సాంకేతిక పరికరాలు అందుబాటులో లేని కాలంలోనే సూర్యచంద్ర గ్రహణాలను గణించిన ఘనత మన దేశ సొంతం. ఆంగ్లేయుల క్యాలెండర్ ను అవసరాల రీత్యా అమలు చేసుకున్నా... నుతన సంవత్సరం వేడుకలను మాత్రం ఉగాదినే జరుపుకోవాలి. చైత్రమాసం ఆరంభంతోనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రపంచ దేశాలతో ప్రయాణంలో భాగంగా ఆంగ్ల క్యాలెండర్ ను ఉపయోగించినా పంచాంగం ప్రకారం ఉగాదినే మనకు నూతన సంవత్సరం.

జనవరి 1కి, డిసెంబర్ 31వ తేదీకి పెద్ద తేడా లేదు. కానీ ఉగాది సందర్భంగా కాలంలో తేడాను గమనించవచ్చు. ఉగాది పచ్చడిని కేవలం ఉగాది రోజు మాత్రమే తీసుకుంటాం. ఉగాది తెలుగు వారి ప్రత్యేక పండగ. తెలుగు భాష అనేది ఎంత ప్రత్యేకమో... ఉగాది కూడా తెలుగు వారి ఉనికికి నిదర్శనం.

మన జోతిష్య శాస్త్రం ఎలాంటి దోషాలు లేనిది

ఫిభ్రవరి 29 తేదీల్లో శుభ లేదా అశుభ కార్యం జరిగితే వాటిని జరుపుకోవడానికి నాలుగేళ్ల వరకు ఎదురు చూడాలి. కానీ తిథుల ప్రకారమైతే ఏటా జరుపుకోవచ్చు. చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి తిథులు ఉంటాయి. పాడ్యమి నుంచి అమవాస్య తిరిగి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అద్భుతమైన రీతిలో పూర్వీకులు కాలగమనాన్ని రచించారు. దీని ప్రకారమే ఉగాది పండగ వస్తుంది. ఉగాదిని ప్రోత్సహించి, తెలుగు సంస్కృతిని చాటే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos