బాబు గోగినేనిపై పరిపూర్ణానంద స్వామి సీరియస్

swami paripoornananda fire on babu gogineni
Highlights

రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే వారికి బాబు గోగినేని లాంటివాళ్లు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. బాబు గోగినేని దుర్మార్గపు భావజాల్ని కలిగిన వ్యక్తి అని పరిపూర్ణాంద స్వామి విమర్శలు గుప్పించారు.

తత్వవెత్త, హేతువాది , ప్రస్తుతం బిగ్ బాస్ 2 కంటిస్టెంట్ గా కొనసాగుతున్న బాబు గోగినేనిపై పరిపూర్ణానంద స్వామి సీరియస్ అయ్యారు. నగరంలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయని స్వామి పరిపూర్ణానంద అన్నారు. 

భావప్రకటనా స్వేచ్ఛ అంటూ కులాలు, మతాలను కించపరచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్ని కులాలు, మతాలకు సమాన గౌరవం, విలువలు ఉన్నాయని అన్నారు. మతాల ఉనికిని దెబ్బతీయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని స్వామీజీ తెలిపారు. 

రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే వారికి బాబు గోగినేని లాంటివాళ్లు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. బాబు గోగినేని దుర్మార్గపు భావజాల్ని కలిగిన వ్యక్తి అని పరిపూర్ణాంద స్వామి విమర్శలు గుప్పించారు.

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని నగరం నుంచి 6నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలోనే యాత్ర చేయాలనుకున్న పరిపూర్ణానంద స్వామిని నిన్న హౌజ్ అరెస్టు చేశారు.

అయితే.. బాబు గోగినేనికి కత్తి మహేష్ గతంలో ఓ విషయంలో మద్దతుగా మాట్లాడారు. అంతేకాకుండా.. బాబు కూడా తన మీటింగ్స్ లోనూ దైవంపై తనకు నమ్మకం లేనట్లే చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే పరిపూర్ణానంద స్వామి బాబు గోగినేనిపై ఇలా మండిపడినట్లు సమాచారం. 

loader