హైదరాబాద్:తన పిల్లలను కూడ నటన నేర్చుకొంటానని భావిస్తే బట్టలు లేకుండానే  ఈ ఎక్సర్‌సైజులు చేయాలని  చెబుతానని  సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్ వర్మ  చెప్పారు.

తన పిల్లలను కూడ నటన నేర్చుకొంటానని భావిస్తే బట్టలు లేకుండానే  ఈ ఎక్సర్‌సైజులు చేయాలని  చెబుతానని  సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్ వర్మ  చెప్పారు.

బుధవారం నాడు సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్ వర్మ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను పూర్తిగా బట్టలు విప్పాలని చెప్పలేదన్నారు.

ఛాతీ భాగంగా లో దుస్తులను వదిలేసి ఇతర దుస్తులను మాత్రమే తీసివేయాలని కోరినట్టుగా వినయ్ వర్మ చెప్పారు.  నటన నేర్చుకొనే సమయంలో ఎలాంటి మొహమాటం లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే  తాను ఈ ఎక్సర్‌సైజ్ చేయిస్తానని ఆయన చెప్పారు.

ఈ ఎక్సర్‌సైజ్ కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నారు. నటన నేర్చుకోవాలనే వారు తమ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడ వదిలేయాలన్నారు. మైండ్‌ ఫ్రెష్‌గా ఉండాలనే  ఉద్దేశ్యంతోనే తాను ఈ ఎక్సర్‌సైజ్ చేయిస్తానని చెప్పారు.

తనపై ఫిర్యాదు చేసిన యువతి స్థానంలో తన పిల్లలు ఉన్నా కూడ వారితో కూడ ఈ ఎక్సర్‌సైజ్ చేయిస్తానని ఆయన తెలిపారు.గతంలో కూడ అనేక మంది యువతులు కూడ ఈ రకమైన వ్యాయామాలు  చేశారని  ఆయన గుర్తు చేశారు. యాక్టింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశ్యం తనపై ఫిర్యాదు చేసిన యువతికి లేదని ఆయన చెప్పారు. తనపై ఆ యువతి పెట్టిన కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని వినయ్ వర్మ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

డైరెక్టర్ నిర్వాకం: దుస్తులిప్పేయాలని యువతులకు షరతు