హైదరాబాద్:  నటన నేర్చుకొనేందుకు వెళ్లిన యువతులకు యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  బట్టలు విప్పితే నటన నేర్పుతానంటూ ఇనిస్టిట్యూట్ వేధింపులకు పాల్పడినట్టు యువతులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

హైద్రాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉన్న సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌కు వినయ్ వర్మ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో 9 మంది యువతులు నటనలో నేర్చుకొనేందుకు చేరారు. 

ప్రతి రోజూ ఉదయం ఆరున్నర గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని ఓ యువతి చెప్పారు. ఇందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన వినయ్ వర్మ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తున్నట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు. 

ఇంతలో  తలుపులు, కిటికీలు అన్ని మూయమని చెప్పి అనంతరం ఒక్కొక్కరిని బట్టలు విప్పితే నటన నేర్పుతానంటూ యువతుల్ని వేధించినట్టుగా  ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కానీ ఒక యువతి ఆయన చెప్పినట్టుగానే బట్టు విప్పింది. మిగతా యువకులు కూడా అలాగే చేశారు అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, తాను బట్టలు విప్పేందుకు నిరాకరిస్తే తనను తిట్టి బయటకు పంపారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  వివరించారు.

యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ నుండి బయటకు రాగానే తాను షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసిందన్నారు. ఏసీపీ నర్మద, రామ్‌లాల్ నుండి వెంటనే స్పందన వచ్చిందన్నారు. ఏసీపీ సూచన మేరకు  నారాయణగూడ పొలీసులకు ఫఇర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు.