సంగారెడ్డి: తమ్ముడు, చెల్లెలును పాశవికంగా హత్య చేసిన నాన్నను  వదలొద్దు అంటూ 10 ఏళ్ల మల్లీశ్వరీ కోరారు. నిద్రపోతున్న తనను కూడ చంపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో  తండ్రి తూలిపడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది.

మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వాంబే కాలనీలో  దేవరయకుమార్‌ తన ఇద్దరు పిల్లలను గొంతు కోసి హత్య చేశాడు. కుమార్‌కు  తన భార్య  శిరీషతో వివాహమైంది.  ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

భార్య శిరీషపై అనుమానంతో  కుమార్  మంగళశారం రాత్రి  గొంతు కోసి హత్య చేశాడు.పెద్ద కూతురు మల్లీశ్వరీని హత్య చేసేందుకు  ప్రయత్నించాడు. మల్లీశ్వరీ గొంతుకు  కత్తి పెట్టి తూలిపడిపోయాడు. 

ఈ సమయంలో  స్వల్పగాయాలతో మల్లీశ్వరీ  తప్పించుకొంది.  మల్లీశ్వరీ వెంటనే నాన్నమ్మ, అత్తను నిద్ర లేపింది. వారు స్థానికులను నిద్ర లేపారు. దీంతో ఇరుగుపొరుగు వచ్చి కుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. తమ్ముడు, చెల్లెను చంపిన నాన్నను వదలొద్దని మల్లీశ్వరీ పోలీసులను కోరింది. 

 

సంబంధిత వార్తలు

భార్యపై అనుమానం: అందుకే పిల్లల గొంతు కోశాడు

కాళ్లు పట్టుకొని బతిమాలినా గొంతు కోశాడు: తండ్రిపై పెద్ద కూతురు

భార్యపై కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపాడు