హైదరాబాద్:  సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్న దేవర కుమార్ తన భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. పెద్ద కూతురును కూడ గాయపర్చినా ఆమె ప్రాణాలతో బయటపడింది.

సంగారెడ్డి జిల్లా  రామచంద్రాపురంలో దేవరయ కుమార్, తన భార్య శిరీష ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. శీరిషతో 12 ఏళ్ల క్రితం దేవరయ కుమార్‌‌కు పెళ్లైంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.

శీరీష, దేవరయ కుమార్‌లకు ముగ్గురు పిల్లలున్నారు. అఖిల్, శరణ్యలతో పాటు 10 ఏళ్ల మల్లీశ్వరీ ఉన్నారు. నెల రోజుల క్రితం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది.ఈ గొడవ కారణంగా శీరీష పుట్టింటికి వెళ్లింది.

భార్యపై కోపంతో  దేవరయకుమార్‌ ఈ నెల 11వ తేదీన భార్యకు ఫోన్ చేసి గొడవ పెట్టుకొన్నాడు. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే నెపంతో  శిరీషతో ఆయన గొడవ పెట్టుకొన్నాడు.

ఈ నెల 16వ తేదీ రాత్రి  తన అఖిల్, శరణ్యలను  మద్యం మత్తులో కుమార్ గొంతుకోసి చంపాడు.  వీరిద్దరిని చంపేసిన తర్వాత కుమార్ పెద్ద కూతురు మల్లీశ్వరీని చంపేందుకు గొంతుపై కత్తి పెట్టాడు.

నిద్రలో ఉన్న మల్లీశ్వరీకి మెలుకువ వచ్చింది. వెంటనే తనను హత్య చేయకూడదని మల్లీశ్వరీ తనను చంపొద్దని  కుమార్‌‌ను కాళ్లు పట్టుకొని ప్రాధేయపడింది.  ఆ సమయంలో కుమార్ సిగరెట్టు కాల్చాడు. అందరం చనిపోతోంటే నీవు బతికి ఉండి ఏం చేస్తావని  కుమార్ ప్రశ్నించారు. తండ్రిని ఆ చిన్నారి ప్రాధేయపడినా  అతను వినలేదు.

మల్లీశ్వరీ గొంతును కత్తితో కోసి కిందపడిపోయాడు. అయితే మల్లీశ్వరీ స్వల్ప గాయాలతో గాయపడింది. తండ్రి కింద పడిపోయిన వెంటనే మల్లీశ్వరీ నాన్నమ్మ, అత్తలను లేపింది. వెంటనే మల్లీశ్వరీకి ప్రాథమిక చికిత్స చేయించారు. స్థానికులు కుమార్‌ను చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

కాళ్లు పట్టుకొని బతిమాలినా గొంతు కోశాడు: తండ్రిపై పెద్ద కూతురు

భార్యపై కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపాడు