హైదరాబాద్: కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ప్రజా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి సుహాసినిపై దుష్ప్రచారం చేస్తున్నారా? అవునని అంటున్నారు కాంగ్రెసు నేత సర్వే సత్యనారాయణ. గెలిచిన తర్వాత సుహాసిని ప్రజలకు అందుబాటులో ఉండరని వివిధ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని ఆయన చెప్పారు 

ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, కూకట్ పల్లిలోనే సుహాసిని ఇల్లు తీసుకున్నారని, ప్రజా సేవ కోసం ఇక్కడే ఉంటారని సర్వే చెప్పారు. సుహాసినిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కూకట్ పల్లి టీడీపి కార్యాలయంలో జరిగిన స్థానిక ఎన్నికల ప్రణాళిక విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

స్థానిక ప్రజలకు తాను అందుబాటులో ఉందడి సేవలు అందిస్తానని సుహాసిని చెప్పారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తానని ఆమె చెప్పారు. తాను అందుబాటులో ఉండబోనని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. 

సంబంధిత వార్తలు

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఎన్నికల షెడ్యూల్ ఖరారు

నందమూరి సుహాసినికి చిక్కులు: ఓటమికి రంగంలోకి వైఎస్ జగన్

కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని ప్రచారం (ఫొటోస్)

ఘర్షణ: సుహాసిని ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు