హైదరాబాద్: ప్రజా కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కూకట్‌పల్లిలోని అల్లాపూర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, టీడీపీ కార్యకర్తల ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌, టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. 

టీఆర్ఎస్ కార్యాలయం ముందు నుంచి సుహాసిని వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత నందమూరి సుహాసిని మధ్యలోనే ప్రచారం ముగించుకొని వెళ్ళిపోయారు.

ప్రజా కూటమి అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఆదివారంనాడు కూడా కూకట్ పల్లి నియోజవర్గంలో ప్రచారం కొనసాగించారు. 

సుహాసిని ప్రచారం గ్యాలరీ

కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని ప్రచారం (ఫొటోస్)