తమ సోదరి సుహాసినిని గెలిపించేందుకు సినీ నటులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు బరిలోకి దిగుతున్నారు. హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికి.. మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి నియోజకవర్గం కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె కూకట్ పల్లి ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ.. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆమె బాబాయి బాలకృష్ణ, సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. వారి ప్రచార షెడ్యూల్ ని ఖరారు చేశారు. ఈ నెల 29వ తేదీ అనంతరం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు.. సుహాసిని తరపున కూకట్ పల్లిలో ప్రచారం చేయనున్నారు.

కాగా.. బాలకృష్ణ కేవలం సుహాసినీకి మాత్రమే కాకుండా.. మహకూటమికి మద్దతుగా పలు ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి అంగీకరించారు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ప్రచారం చేస్తానని బాలయ్య టీడీపీ నేతలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 4 రోజుల పాటు బాలయ్య ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

read more news

నందమూరి సుహాసినికి చిక్కులు: ఓటమికి రంగంలోకి వైఎస్ జగన్

కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని ప్రచారం (ఫొటోస్)

ఘర్షణ: సుహాసిని ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు