హైదరాబాద్: కరోనా వైరస్ భయంతో ముఖానికి  ధరించే మాస్క్‌ల కు డిమాండ్ పెరుగుతోంది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తి ఇప్పటికే హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ఇద్దరికి సంబంధించిన శాంపిల్స్‌ను మరోసారి పూణెలో కు పంపారు. దీంతో హైద్రాబాద్‌లో మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

బెంగుళూరులో టెక్కీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి దుబాయ్‌కు వెళ్లాడు. విధి నిర్వహణలో భాగంగా ఆయన దుబాయ్ నుండి బెంగుళూరుకు వచ్చాడు. బెంగుళూరు నుండి హైద్ారబాద్ కు తిరిగి వచ్చాడు. హైద్రాబాద్ కు వచ్చిన అతడికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా  గుర్తించారు. ఇవాళ ఒక్క రోజే 15 మంది అనుమానితులు గాంధీ ఆసుపత్రికి వచ్చారు.

కరోనా భయంతో  ముఖానికి మాస్కులు లేకుండా బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. దీంతో మాస్కుల ధరలకు రెక్కలొచ్చాయి. రెండు లేయర్లు ఉన్న మాస్క్ ధర రూ. 1.60 పైసలు. ఈ మాస్క్ ను రూ. 10లకు పైగా విక్రయిస్తున్నారు. ఎన్ -95  మాస్క్ ను రెండు వందలకు పైగా విక్రయిస్తున్నారు. వాస్తవానికి దీని ధర రూ. 40 .

కరోనా భయాన్ని మెడికల్ షాపు దుకాణాదారులు సొమ్ము చేసుకొంటున్నారు. గాంధీ ఆసుపత్రికి వచ్చే వారు విధిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అయితే  గాంధీ ఆసుపత్రి ఆవరణలోని మెడికల్ షాపులో  ఈ నెల 3వ తేదీన మాస్క్‌ల కొరత ఏర్పడింది. మాస్క్‌లకు డిమాండ్ ఉన్న దృష్ట్యా   హోల్‌సేల్  వ్యాపారులు ఆమాంతం ధరలను పెంచినట్టుగా చెబుతున్నారు.  దీంతో మాస్కులను సాధారణ ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టుగా చెబుతున్నారు.