మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే...

మంత్రి శ్రీనివాస్ గౌడ్  2018 ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫీడవిట్లో టాంపరింగ్ కి పాల్పడ్డారని రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ వేశారు. 

Supreme Court Notices to Minister Srinivas Goud - bsb

హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వెంటనే సమాధానం చెప్పాలంటూ నోటీసులు పంపించింది. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నికలపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేందర్ రాజు అనే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఇటీవల కొట్టి వేసింది. దీంతో శ్రీనివాస్ గౌడ్ కు ఊరట లభించినట్లు అయింది. అయితే రాఘవేంద్ర రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు.  రాఘవేందర్ రాజు వేసిన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టులోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.  రాఘవేంద్ర రాజు పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం దీని మీద సమాధానం చెప్పాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది. 

అభివృద్ధికి మారుపేరు బీఆర్ఎస్.. 78 స్థానాల విజ‌యంతో మ‌ళ్లీ అధికారం మాదే: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

ఇదిలా ఉండగా, అక్టోబర్ 10న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట లభించింది.  ఆయన ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. రాఘవేంద్రరాజు అనే పిటిషనర్ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.

కాగా, 2019లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫీడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మొదట రిటర్నింగ్ అధికారికి అఫిడవిటిను సమర్పించి... మళ్ళీ వెనక్కి తీసుకున్నారని..  ఆ తర్వాత సవరించి ఇచ్చారని ఆరోపించారు. 

ఇలా చేయడం టాంపరింగ్ కిందికి వస్తుందని.. చట్టవిరుద్ధమని..  మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషనర్ రాఘవేంద్ర రాజు హైకోర్టును కోరారు. దీని మీద విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు  ఈ వివాదం మీద తీర్పును నేటికి వాయిదా వేసింది. దీని మీద విచారణ చేసిన హైకోర్టు మంగళవారం నాడు  పిటిషన్ను కొట్టివేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios