Asianet News TeluguAsianet News Telugu

వినలేం, న్యాయ కమిషన్‌కు చెప్పండి: దిశ నిందితుల ఫ్యామిలీకి సుప్రీం

దిశ నిందితుల ఫ్యామిలీ దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకొనే అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కు సంబంధించి న్యాయ కమిషన్‌కు చెప్పుకోవాలని కోర్టు సూచించింది. 

Supreme court gives chance to withdraw petition to disha accused family
Author
Hyderabad, First Published Feb 28, 2020, 1:55 PM IST


న్యూఢిల్లీ: దిశ నిందితుల కుటుంబ సభ్యులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  దిశ నిందితలు కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నాడు  పిటిషన్ ను విచారించింది.

గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన షాద్‌నగర్‌కు సమీపంలోని చటాన్‌పల్లి వద్ద అండర్ పాస్ వద్ద నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.   ఈ ఘటనపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిందితుల కుటుంబసభ్యులు.

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: విచారణ ప్రారంభించిన సుప్రీం కమిటీ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే  న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టుగా  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గుర్తు చేశారు.  ఈ సమయంలో ఈ పిటిషన్‌ను విచారించలేమని సీజే అభిప్రాయపడ్డారు. 

ఏదైనా చెప్పాలనుకొంటే  న్యాయ కమిషన్‌కు మాత్రమే చెప్పాలని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషన్ దారులకు సూచించారు. ఈ దశలో పిటిషన్‌ను ఉపసంహరించుకొనే అవకాశాన్ని సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన  దిశ నిందితుల కుటుంబసభ్యులకు సూచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios