పిటిషన్ ను త్వరగా విచారించలేం: కవితకు సుప్రీంలో చుక్కెదురు

ఈ నెల  24వ తేదీ కాకుండా  త్వరంగా  పిటిషన్ ను  విచారించాలని  కవిత  చేసిన అభర్ధనను  సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

Supreme Court  Denies  To  Early  hearing  on  BRS MLC  Kalvakuntla  Kavitha petition

హైదరాబాద్: తన పిటిషన్ ను త్వరగా  విచారించాలని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత  అభ్యర్ధనను  సుప్రీంకోర్టు తిరస్కరించింది.  ఈ నెల  24వ తేదీనే  ఈ పిటిషన్ ను విచారిస్తామని  సుప్రీంకోర్టు తెలిపింది.  

ఈ నెల  15వ తేదీన  సుప్రీంకోర్టులో  కల్వకుంట్ల కవిత  పిటిషన్ దాఖలు  చేశారు. ఈడీ విచారణను  సుప్రీంకోర్టులో  సవాల్  చేశారు.  మహిళలను ఈడీ అధికారులు విచారించవచ్చా అని  కూడా  ఆ పిటిషన్ లో  కోరారు.దర్యాప్తు అధికారులు  విచారణ సమయంలో  చిత్రహింసలకు గురి చేస్తున్నారని  ఆరోపించారు.  ఈ పిటిషన్ పై  ఈ నెల  24న విచారణ చేస్తామని  సుప్రీంకోర్టు తెలిపింది.  అయితే  ఇవా ళ  సుప్రీంకోర్టు  ప్రారంభమైన సమయంలో  సీజేఐ  ధర్మాసనం ముందు కవిత  న్యాయవాదులు  ఈ పిటిషన్  గురించి ప్రస్తావించారు.  ఈ పిటిషన్ ను త్వరగా  విచారించాలని  సీజేఐ దర్మాసనాన్ని కోరారు. అయితే  త్వరగా  విచారించాలన్న  కవిత  తరపు న్యాయవాదుల అభ్యర్ధనను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.  ఈ నెల  24నే విచారణ  చేస్తామని    సుప్రీంకోర్టు  తేల్చి చెప్పిందని  ప్రముఖ  తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ నెల 20వ తేదీన   కవిత విచారణ  కావాల్సి ఉంది. వాస్తవానికి ఈ నెల  16వ తేదీన  కవిత  ఈడీ విచారణకు  హాజరు కావాలి. కానీ  నిన్న  ఈడీ విచారణకు  ఆమె హాజరు కాలేదు.  సుప్రీంకోర్టులో తన పిటిషన్ లో  పెండింగ్ లో  ఉందని ఆ లేఖలో  పేర్కొన్నారు. సుప్రీంకోర్టు  తీర్పు తర్వాత  విచారణకు  హాజరు కానున్నట్టుగా  ఆమె స్పష్టంచేశారు.  కానీ ఈడీ  ఈ నెల  20వ తేదీన విచారణకు  రావాలని ఈడీ అధికారులు  మరోసారి  కవితకు నిన్న నోటీసులు జారీ చేశారు. దీంతో  తన పిటిషన్ ను త్వరగా విచారించాలని  కవిత  కోరారు. కవిత  అభ్యర్ధనను  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది

also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు: నేడు సుప్రీంకోర్టుకు కవిత

ఇదిలా ఉంటే  అరుణ్ రామచంద్రపిళ్లైకి ఈడీ కస్టడీని ఈ నెల  20వ తేదీ వరకు  కోర్టు పొడిగించింది.  ఇవాళ  ఈడీ విచారణకు  ఆడిటర్ బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ నెల  18న  వైసీపీ  ఎంపీ మాగుంట  శ్రీనివాసులు రెడ్డి  హాజరు కానున్నారు. కవిత ను ఇతరులతో కలిపి విచారించాలని  ఈడీ ప్లాన్ గా  కన్పిస్తుంది.  ఈ కారణంగానే అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని  కోర్టును అడిగింది  ఈడీ.  అరుణ్ రామచంద్రపిళ్లై ఈడీ విచారణ సమయంలో  కవిత పేరును ప్రస్తావించారు. దీంతో  కవితను  అరుణ్ రామచంద్రపిళ్లైతో  కలిపి  విచారించే అవకాశం ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios