Hyderabad: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతోంది. రాబోయే ఐదు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగన్నాయని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతోపాటు వాయివ్యంలోని కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయనీ, వ‌డ‌దెబ్బ బారిన‌ప‌డ‌కుండా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

Summer heat wave rising: ఎండ‌లు మండిపోతున్నాయి. భ‌నుడు ప్ర‌తాపం చూపుతున్నాడు. గ‌త కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతోంది. రాబోయే ఐదు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగన్నాయని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతోపాటు వాయివ్యంలోని కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయనీ, వ‌డ‌దెబ్బ బారిన‌ప‌డ‌కుండా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

వివ‌రాల్లోకెళ్తే.. వాతావ‌ర‌ణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కార‌ణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్ర‌త మ‌రింత‌గా పెరుగుతుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం వెల్ల‌డించింది. తెలంగాణ‌లోనూ ఎండ‌లు మండిపోతున్నాయి. ప‌లు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రానున్న రోజుల్లో పొడి వాతావ‌ర‌ణం, ఎండలు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ-హెచ్) అంచనా వేసింది. నగరంలో ఇప్పటికే ఉన్న అధిక ఉష్ణోగ్రతలు వర్షం లేకుండా మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు పగటిపూట బయటకు వెళ్లడం కష్టంగా మారింది.

పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌నీ, వ‌డ‌దెబ్బ బారిన‌ప‌డ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారులు సూచించారు. వసంత రుతుపవనాల చివరి వర్షం ముగియడంతో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవచ్చని ఐఎండీ-హెచ్ తెలిపింది. అలాగే, నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఇదే స‌మ‌యంలో ప‌లు జిల్లాల్లో ఎండ‌ల తీవ్ర‌త పెర‌గ‌డంతో వ‌డ‌గాలులు వీస్తాయ‌ని పేర్కొంది. 

దేశంలోని చాలా ప్రాంతాల్లో పెరిగిన ఉష్ణోగ్ర‌త‌లు... 

 దేశంలోని ప‌లు ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో ఎండ‌లు మ‌రింత పెర‌గ‌నున్నాయి. మధ్యప్రదేశ్, ఒడిశా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లలో ఉరుములు, బలమైన గాలులు కూడా వీస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఎండ‌ల తీవ్ర‌త పెరిగి, వడగాలులు వీస్తాయ‌ని పేర్కొంది.