తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగినయ్. బాన్సువాడలో భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో జనాలు హాజరై పోచారం కు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ జరిపారు. గులాబీ బెలూన్లతో స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఇదంతా గొప్పగానే సాగినా.. చిన్న వివాదం మాత్రం తలెత్తింది. బాన్సువాడలో పోచారం రాక కోసం స్వాగతం పలికే కార్యక్రమంలో స్థానికంగా ఉన్న కాలేజీల నుంచి విద్యార్థులను తరలించారు. కాలేజీ అమ్మాయిలు, కాలేజీ అబ్బాయిలు పెద్ద సంఖ్యలో గులాబీ రంగు బెలూన్లు చేతబట్టుకుని కనిపించారు. వారందరూ స్వచ్ఛందంగానే వచ్చి మంత్రికి స్వాగతం పలికారా? లేక కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడుకుని వారి చదువులు పక్కన పెట్టించి తీసుకొచ్చారా అన్నది ఇప్పుడు వివాదం అయింది. కాలేజీ పోరగాళ్లను ఎందుకు పట్టుకొచ్చిర్రబ్బా అని బాన్సువాడ జనాలే కాకుండా నిజామాబాద్ జనాల్లో కూడా చర్చ బాగానే సాగుతున్నది. కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు ఎట్ల స్వాగతం పలుకుతున్నరో కింద వీడియోలో చూడండి.