Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్ 2: ఆర్ట్స్ కాలేజీ ముందు సీఎం దిష్టిబొమ్మ దహనానికి పిలుపు

గ్రూప్ 2 పరీక్షా ఫలితాల్లో అక్రమాలు జరిగాయని పరీక్ష రాసిన అభ్యర్థులు లెవనెత్తిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని  విద్యార్థులు కోరుతున్నారు.  ఈ ఫలితాల్లో జరిగిన తప్పులపై సీబీఐ చే విచారణ జరిపించాలని కోరుతూ  ఈ రోజు సాయంత్రం 4:30 కు ఆర్ట్స్ కళాశాల ముందు సీఎం దిష్టిబొమ్మ దహనం చేయాలని  విద్యార్థి నిరుద్యోగ  జె ఎసి పిలుపునిచ్చింది.

students mulling to challenge tspsc groups 2 results for alleged corruption

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఫలితాల మీద మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. నిజాంబాద్ లోని ఒకే సెంటర్ నుంచి వందల సంఖ్యలో అభ్యర్థులు పాస్ కావడం పట్ల చాలా మంది గ్రూప్ 2 రాసి ఫలితాలు కోసం ఎదురు చూసి నిరాశ చెందినవారంతా అవాక్కవుతున్నారు. నిజాంబాద్ లోని ఒక సెంటర్ లో 3147 మంది పరీక్ష రాసే 1578 సెలెక్టయ్యారు. రాష్ట్రంలోని మరే సెంటర్ నుంచి ఇంతమంది పాస్ కాలేదని, సెంటర్ నుంచి 20 నుంచి 50 మందిపాస్ అయితే గొప్ప అని చాలా మంది విద్యార్థులు ఏషియానెట్ కు తెలిపారు.

 

ఈ  సెంటర్ నుండి ఒకే  సిరీస్ నంబర్ ఉన్నవాళ్లు వరసగా 60 మంది సెలెక్ట్ అయ్యారు టిఎస్పిఎస్సి వాళ్లే ర్యాంకర్లు అని ముందెే పసిగట్టి వాళ్ళందర్ని ఒకే సెంటర్ లొ వేసిందా? అని ఆశ్చర్యపోతున్నారు.

students mulling to challenge tspsc groups 2 results for alleged corruption

 

 

తెలంగాణా వచ్చాక, ఒక గొప్ప ప్రొఫెసర్ని, ఉద్యమ కారుని టిఎస్ పి ఎస్ సి  ఛెయిర్మన్ గా చేశారు కాబట్టి ఇక టిఎస్ పిఎస్ సి  సెలక్షన్ తీరు యుపిఎస్ సి ని మించిపోతుందని అంత అనుకున్నారు. తీరా చూస్తే ఇది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ గాతయారయిందని అంటున్నారు.

 

‘ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ,కనీవినీ ఎరగని రీతిలో TSPSC గ్రూప్ 2 పరీక్షను నిర్వహించబోతుందని గొప్పలు చెప్పి , చివరికి పరీక్షా రోజున తుస్సుమనిపించింది. పరీక్షా నిర్వహణలోనూ ఘోరంగా విఫలమయ్యి, తూ తూ మంత్రంగా పరీక్షా నిర్వహించి , అభ్యర్థులను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని విద్యార్థులు వాపోతున్నారు .ఇక పరీక్షా నిర్వహణ తర్వాత విడుదలయిన కీ లో లెక్కకు మించి తప్పులు ఉన్నాయి. ఆ తరువాత 17 ప్రశ్నలను తొలగించడం,మరో 14 ప్రశ్నలకు ఒకటికి మించి జవాబులు ఇవ్వడం మొదలైన పనికిమాలిన నిర్ణయాలతో “కాలయాపన చేసి “చివరకి తప్పుడు కి విడుదల చేశారు . ఇక ఆ తరువాత group2 ఫలితాలను అప్పుడిస్తాం ఇప్పుడిస్తాం అని ఆగమాగమయి …అంతిమంగా ఫలితాలను వెల్లడించిన TSPSC అందర్నీ ఆశ్చర్య పరుస్తూ “అవినీతి “కి తెరలేపింది .అంతుపట్టని ,అయోమయ పలితాలతో పొంతన లేని నిర్ణయాలతో అందర్నీ అట్టే ముంచింది .అసలు ఎం జరిగిందో తెలుసుకుందామంటే అందుబాటులో లేకుండా పోయింది ,’అని విద్యార్థులు తమ గోడును ఏషియానెట్ ముంద ఎల్ల బోసుకున్నారు.

గ్రూప్ 2   రద్దవుతుందా ?

ఈ అనుమానం ఫలితాలు చూశాక చాలా మందిలో కలుగుతూ ఉంది. ఈ అనుమానానికి కారణం ఓఎంఆర్‌ ‘తప్పు దిద్దుబాటు’దారులకూ ఎంపిక జాబితాలో చోటు కల్పించడం.పరీక్షకు ముందు  ఓఎంఆర్‌ షీట్‌పై ఎలాంటి దిద్దుబాట్లను అంగీకరించే ప్రసక్తే లేదని అలాంటి అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనానికి పరిశీలించబోమని టీఎస్‌పీఎస్సీ  నిబంధనల్లో స్పష్టం చేసింది. రద్దువుతుందా, నిరవధికంగా వాయిదా పడుతుందా అనే ఆందోళనతో  విద్యార్థులు సతమతమవుతున్నారు.

కానీ పరీక్షలో కొంతమంది వైట్‌నర్‌తో దిద్దుబాట్లు చేశారు. వీరి సంఖ్య దాదాపు 50వేల దాకా ఉంటుందని కమిషన్‌ వర్గాలే గతంలో తెలిపాయి. ఓఎంఆర్‌ షీట్‌పై పై వైట్నర్ వాడిన అభ్యర్థుల వాదనేంటి?

దిద్దుబాటు అభ్యర్థుల వాదనను హైకోర్టు కొట్టేస్తూ వారి జవాబుపత్రాలను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏప్రిల్‌ 24 ,2017 న తేల్చిచెప్పింది.హైకోర్టే కాద. గతంలో సుప్రీంకోర్టూ పలు కేసుల్లో దిద్దుబాటు అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని చెప్పింది.టీఎస్‌పీఎస్సీ కూడా హైకోర్టులో ఇదే వాదన వినిపించింది.

మరి ఫలితాల విడుదల తరువాత ఏమైంది?

వారిని పరిగణలోకి తీసుకోకుండా మిగితావారి ఫలితాలను వెల్లడించండి అని కోర్టు చెప్పినాక కూడా …అన్నిటిని తోసిరాజని పరీక్షలో జవాబు పత్రాల(ఓఎంఆర్‌ షీట్లు)పై వైట్‌నర్‌తో దిద్దుబాట్లు చేసిన అభ్యర్థుల్లో చాలా మందికి శుక్రవారంనాటి ఫలితాల జాబితాలో చోటు దక్కింది .ఇది ఎలా ? దాదాపు ..కోర్టు లో కేసు వేసిన అందరి అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు ఫలితాల జాబితాలో ఉండటం అనుమానాలకు తావిస్తుంది.

 

వీరంతా ఇపుడు కోర్టులో టిఎస్ పిఎస్ సి కి వ్యతిరేకంగా కేసువేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉస్మానియా అర్స్ట్ కాలేజీ దగ్గిర కొద్ది సేపట్లో సిఎం  దిష్టిబొమ్మ దహనం చేయాలన్న కార్యక్రమం విజయవంతమవుతుందా?

 

గ్రూప్ 2 పరీక్షా ఫలితాల్లో అక్రమాలు జరిగాయని పరీక్ష రాసిన అభ్యర్థులు లెవనెత్తిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫలితాల్లో జరిగిన తప్పులపై సీబీఐ చే విచారణ జరిపించాలని ఈ రోజు సాయంత్రం 4:30 కు ఆర్ట్స్ కళాశాల ముందు సీఎం దిష్టిబొమ్మ దహనానికి విద్యార్ధి నిరుద్యోగ జెఏసి చైర్మెన్ కోటూరి మానవతారాయ్ పిలుపు నిచ్చారు. ఏమవుతుందో చూద్దాం.


 

 

Follow Us:
Download App:
  • android
  • ios