ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వాగ్వాదానికి దిగారు. శ్రీనిధి కాలేజ్ యాజమాన్యం మోసపూరితంగా అడ్మిషన్లు తీసుకుందని వారు ఆరోపించారు.

హైదరాబాద్: ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వాగ్వాదానికి దిగారు. శ్రీనిధి కాలేజ్ యాజమాన్యం మోసపూరితంగా అడ్మిషన్లు తీసుకుందని వారు ఆరోపించారు. యూనివర్సిటీ పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. శ్రీనిధి కాలేజ్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కాలేజ్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.