హైదరాబాద్ మాదాపూర్‌లోని  నారాయణ కాలేజీలో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 8న కాలేజీలో చేరాడు కనకరాజు. రోజుల వ్యవధిలోనే అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 

హైదరాబాద్ మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నారాయణ కాలేజీలో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్ధి కనకరాజు. ఈ నెల 8న కాలేజీలో చేరాడు కనకరాజు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీకు చేరుకుని పరిశీలించారు. విద్యార్ధి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.