Asianet News TeluguAsianet News Telugu

ఐస్‌క్రీంలో వీర్యం కలుపుతూ.. గలీజు పని.. వరంగల్‌లో వ్యక్తి అరెస్టు (వీడియో)

వరంగల్‌లో ఓ దుండగుడు తన వీర్యాన్ని ఐస్ క్రీంలో కలిపి అమ్ముతూ పట్టుబడ్డాడు. తోపుడు బండి వద్దే హస్త ప్రయోగం చేసుకుని ఐస్ క్రీంను కలుషితం చేశాడు. అధికారులు యాక్షన్ తీసుకున్నారు.
 

street vendor masturbates and mixes semen in ice cream in a viral video, food safety officers took action kms
Author
First Published Mar 19, 2024, 7:55 PM IST

వరంగల్ జిల్లాలో ఓ వికృతమైన చర్య కెమెరాకు చిక్కింది. తోపుడు బండిపై ఐస్ క్రీం, ఫలూదా, ఇతర డిజర్ట్స్‌ను అమ్మే ఓ దుండగుడు దారుణమైన పని చేశాడు. తోపుడు బండి వద్దే నిలబడి హస్త ప్రయోగం చేసుకుని ఐస్ క్రీంలో తన వీర్యం కలిపాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటన వరంగల్‌లోని నెక్కొండ ఏరియాలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే ఆహార భద్రత అధికారులు,  లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తక్షణమే రంగంలోకి దూకారు. బాలాజీ అని పేరున్న ఆ ఐస్ క్రీం స్టాల్ వద్దకు చేరుకున్నారు. ఐస్ క్రీంను కలుషితం చేసి అమ్ముతున్న ఆ దుండగుడిని, అందులో ప్రమేయం ఉన్న ఇతరులనూ అదుపులోకి తీసుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios