Asianet News TeluguAsianet News Telugu

వ్యాపారవేత్త శ్రీధర్ రావుపై చీటింగ్ కేసు.. రంగంలోకి స్టీఫెన్ రవీంద్ర...

సీసీ Stephen Ravindraను ఆశ్రయించిన బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9న శ్రీధర్ రావు మీద ఫిర్యాదు చేశారు. శ్రీధర్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరయ్యారు. 

Stephen Ravindra to handle sandhya convention md sridhar rao cheating case
Author
Hyderabad, First Published Nov 11, 2021, 12:39 PM IST

రాయదుర్గం : ప్రముఖ వ్యాపారవేత్త, బిల్డర్ సంధ్యా కన్వేన్షన్ అధినేత సరనాల శ్రీధర్ రావుపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదయ్యింది. బుధవారం రాయదుర్గం పోలీసులు శ్రీధర్ రావును అరెస్ట్ చేసి ఉప్పర్ పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. 

పోలీసులు, ఫిర్యాదుదారులు తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 86,87,88,91,92లోని స్థలంలో Sridhar Rao కమర్షియల్ భవనం నిర్మించారు. 5వ అంతస్తులో సుమారు 26వేల చదరపు అడుగుల స్థలాన్ని మాదాపూర్ లోని Gateway ప్రాంతంలో ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు సాఫ్ట్ వేర్ కంపెనీల నిర్వాహకులు 12 మందికి రూ. 17 కోట్లకు విక్రయించేందుకు 2018లో ఒప్పందం కుదర్చుకున్నారు.

ఒప్పందంలో భాగంగా పలు దఫాలుగా రూ.11.24కోట్లు చెల్లించారు. 2018 ఏప్రిల్ వరకు పనులు పూర్తి చేసి అప్పగిస్తానని హామీ ఇచ్చిన శ్రీధర్ రావు భవన నిర్మాణం చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. శ్రీధర్ రావు తీరుపై కొనుగోలు దారులు పలు దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదు. ఇదిలా ఉండగానే శ్రీధర్ రావు నిర్మించిన కమర్షియల్ భవనం వెనుకభాగం కొంత 
Government land ఆక్రమించి నిర్మించాడని GHMC నుంచి శ్రీధర్ రావుకు Noticeలు అందాయి. 

దీంతో శ్రీధర్ రావుతో తాము కుదుర్చుకున్న భవన నిర్మాణంలో వెనుకభాగం ఒక పిల్లర్ల వరుస మొత్తం తొలగించాల్సి వస్తుందని దీని వల్ల Building slab structure దెబ్బతినే అవకాశం ఉందని, దీనిపై శ్రీధర్ రావుతో మాట్లాడదామని ప్రయత్నించినా ఆయన స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. 

సీసీ Stephen Ravindraను ఆశ్రయించిన బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9న శ్రీధర్ రావు మీద ఫిర్యాదు చేశారు. శ్రీధర్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరయ్యారు. 

శ్రీధర్‌ రావు మోసాల విలువ రూ.300 కోట్ల పైనే.. ముంబైలోనూ చీటింగ్, తప్పించేందుకు ఓ ఎస్పీ యత్నం

హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావును (sridhar rao) పోలీసులు నవంబర్ 10న అరెస్ట్ చేశారు. ఆయనను బుధవారం రాయదుర్గం పోలీసులు (rayadurgam police) అదుపులోకి తీసుకున్నారు. ఓ భవన నిర్మాణానికి సంబంధించి పలువురిని మోసం చేశాడు శ్రీధర్ రావు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు శ్రీధర్‌‌పై రాయదుర్గం పోలీసులు చీటింగ్ (cheating case) కేసు నమోదు చేశారు. 

భవనం అమ్మకాల విషయంలో కొనుగోలుదారులను మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు కొనుగోలుదారుల నుంచి భారీగా నగదును వసూలు చేసినట్లుగా తేలింది. ఎన్ఆర్ఐ ముక్కామల అప్పారావు, బసవతారకం క్యాన్సర్ (basavatarakam cancer hospital) ఆసుపత్రి ట్రస్ట్ మెంబర్ తులసిని మోసం చేసినట్లు శ్రీధర్ రావుపై ఆరోపణలు వున్నాయి. 28 వేల ఎస్ఎఫ్‌టీ స్పేస్‌కు రూ.15 కోట్లు అడ్వాన్స్ తీసుకుని వెనక్కి ఇవ్వలేదని శ్రీధర్ రావుపై ఆరోపణలు వున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐ దగ్గర 12 ఎకరాల భూమికి సంబంధించి మరో వివాదం కూడా శ్రీధర్‌పై వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios