Asianet News TeluguAsianet News Telugu

శ్రీధర్‌ రావు మోసాల విలువ రూ.300 కోట్ల పైనే.. ముంబైలోనూ చీటింగ్, తప్పించేందుకు ఓ ఎస్పీ యత్నం

సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావు (sridhar rao) మోసాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సుమారు రూ.300 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బిల్డర్స్, వ్యాపారవేత్తలను మోసం చేసినట్లుగా శ్రీధర్ రావుపై ఆరోపణలు వున్నాయి.

sandhya convention md sridhar rao cheating case updates
Author
Hyderabad, First Published Nov 10, 2021, 8:52 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సంధ్య కన్వెన్షన్ (sandhya convention) ఎండీ శ్రీధర్ రావు (sridhar rao) మోసాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సుమారు రూ.300 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బిల్డర్స్, వ్యాపారవేత్తలను మోసం చేసినట్లుగా శ్రీధర్ రావుపై ఆరోపణలు వున్నాయి. నిర్మాణాల పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. నగరంలోని కొంతమంది బిల్డర్స్ వద్ద డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినట్లుగా కూడా సమాచారం. ట్రస్ట్ పేరుతో కూడా శ్రీధర్ రావు కొందరినీ మోసం చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. 

ముక్కామల అప్పారావును శ్రీధర్ రావు భారీ మొత్తంలో మోసం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రముఖ బిల్డర్ వద్ద భవనం కొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడని పోలీసులు అంటున్నారు. హైదరాబాద్‌తో (hyderabad) పాటు ముంబైకి (mumbai) చెందిన ప్రముఖ బిల్డర్స్‌ని కూడా శ్రీధర్ రావు మోసం చేసినట్లు సమాచారం. దీంతో వారు డబ్బుల కోసం శ్రీధర్ రావు చుట్టూ తిరిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని (jubilee hills) ప్రముఖ శారీసెంటర్ యజమానురాలిని కూడా శ్రీధర్ రావు మోసం చేసినట్లుగా సమాచారం. 

Also Read:భవన నిర్మాణం పేరిట రూ. కోట్లలో మోసం.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్, బాధితుల్లో ప్రముఖులు

అయితే శ్రీధర్ రావును కేసు నుంచి తప్పించేందుకు పోలీస్ శాఖలోని ఓ అదనపు ఎస్పీ రంగంలోకి దిగినట్లుగా సమాచారం. అతని కోసం సదరు ఎస్పీ నిన్న హైకోర్టులో తీవ్ర యత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రాయదుర్గం (raidurgam police ) కేసు నుంచి శ్రీధర్‌ను తప్పించేందుకు అదనపు ఎస్పీ తీవ్రంగా ప్రయత్నించినట్లు పోలీస్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో అదనపు ఎస్పీని వారు మందలించినట్లుగా తెలుస్తోంది. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఆయనపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. 

అంతకుముందు చీటింగ్  కేసులో అరెస్ట్ చేసిన శ్రీధర్ రావును బుధవారం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఓ భవన నిర్మాణానికి సంబంధించి పలువురిని మోసం చేసినట్లు శ్రీధర్‌పై ఆరోపణలు వున్నాయి. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. భవనం అమ్మకాల విషయంలో శ్రీధర్ రావు కొనుగోలుదారులను మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటున్నారు శ్రీధర్ రావు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని భూమి విషయంలో తనకు శ్రీధర్ రావు డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు ఆయన బాధితుడు మహేశ్. శ్రీధర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని.. తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరుతున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios