ఒకవైపు చూస్తే కంటి చూపు పోతుంది: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కడియం శ్రీహరి ఎమ్మెల్సీ, తాను ఎమ్మెల్యేను. మా ఇద్దరిని రెండు కళ్లలా చూసుకోవాలి,. ఒక వైపు చూస్తే కంటి చూపు పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. 

Station Ghanpur MLA  Thatikonda Rajaiah Sensational Comments on Protocol

వరంగల్: కడియం శ్రీహరి ఎమ్మెల్సీ, తాను ఎమ్మెల్యేను. మా ఇద్దరిని రెండు కళ్లలా చూసుకోవాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు.ఒక వైపు చూస్తే కంటి చూపు పోతుందని వ్యాఖ్యానించారు.కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య  తీవ్ర వ్యాఖ్యలు  చేస్తున్నారు. రాజయ్యకు అంతే స్థాయిలో కడియం శ్రీహరి కూడా బదులు చెబుతున్నారు. 

ప్రొటోకాల్ ప్రకారంగా సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలన్నారు. ఎమ్మెల్యే దగ్గరికి రావడమే ప్రోటోకాల్ అని ఆయన చెప్పారు.కడియం శ్రీహరి ఎమ్మెల్సీ, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆరు మాసాలే అవుతుందన్నారు. మా ఇద్దరిని రెండు కళ్లలా చూసుకోవాలన్నారు. లేకపోతే కంటి చూపుపోతుందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

గత మాసంలో  కడియం శ్రీహరిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్ల ఎన్ కౌంటర్ల కు  కడియం శ్రీహరి కీలకంగా వ్యవహరించారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లకు కడియం శ్రీహరి బాధ్యుడని ఆయన ఆరోపించారు. తన గెలుపులో కడియం శ్రీహరి పాత్ర లేదని కూడా వ్యాఖ్యానించారు. 

ఈ ఆరోపణలపై కడియం శ్రీహరి కూడా స్పందించారు. ఎన్ కౌంటర్లకు సంబంధించి తన పాత్ర లేదన్నారు. ఎన్ కౌంటర్లు జరిగే పరిస్థితి ఉన్న సమయంలో ఎన్ కౌంటర్లు జరగకుండా వ్యవహరించినట్టుగా చెప్పారు. నక్సలైట్లపై నిషేధం ఎత్తివేయాలని ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన వద్దకు ప్రజ సంఘాల నేతలను తీసుకెళ్లి నక్సటైట్లపై నిషేధం ఎత్తి వేయించడంలో కీలక పాత్ర పోషించినట్టుగా చెప్పారు. తన మద్దతు లేకుండా రాజయ్య గెలిచాడా అని ఆయన ప్రశ్నించారు. రాజయ్యకు ఏమైనా ఇబ్బందులుంటే పార్టీ అధిష్టానానికి చెప్పుకోవాలని కడియం శ్రీహరి సూచించారు. 

also ead:కడియం శ్రీహరి 360 మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయించారు.. రాజయ్య సంచలన ఆరోపణలు..

గతంలో కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే,. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios