Asianet News TeluguAsianet News Telugu

కడియం శ్రీహరి 360 మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయించారు.. రాజయ్య సంచలన ఆరోపణలు..

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,  స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల మధ్య రాజకీయ వైరం ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య ఆదిపత్య పోరు మాత్రం కొసాగుతుంది. 

thatikonda rajaiah sensational comments kadiyam srihari
Author
First Published Aug 30, 2022, 1:25 PM IST

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,  స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల మధ్య రాజకీయ వైరం ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య ఆదిపత్య పోరు కొసాగుతుంది. కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో 361 మంది నక్సలైట్లను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోయారని తెలిపారు. 

తనకు రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అయితే.. ప్రస్తుత సీఎం కేసీఆర్‌ దేవుడని రాజయ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తాను పూజారినని.. ఆ దేవుడిచ్చే వరాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ తన అడ్డా అని .. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోను అని కామెంట్ చేశారు. 

ఇక, రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం శ్రీహరి స్పందించారు. తనపై తీవ్ర ఆరోపణలు చేస్తావా అని ప్రశ్నించారు. రాజయ్య ప్రజల మద్దతు కోల్పోతున్నారని అన్నారు. ఘనపూర్ ఎవరి అడ్డ కాదని.. గత ఎన్నికల సమయంలో రాజయ్య విజయం కోసం తాము కూడా కష్టపడ్డామని చెప్పారు. నాలుగు సార్లు గెలిచిన రాజయ్య.. ఘనపూర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. రాజయ్యకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానంతో చెప్పుకోవాలని అన్నారు. రాజయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక, కడియం శ్రీహరి  వర్సెస్ రాజయ్యగా మాటల యుద్దం సాగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఎవరో ఒకరు విమర్శలు చేయడం, దానికి మరోకరు కౌంటర్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios