Asianet News TeluguAsianet News Telugu

NEET Results 2021 : నీట్ లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి ‘నంబర్ 1’

తొలి 100 ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు కాస లహరి (30), ఈమని శ్రీనిజ (38), దసికా శ్రీనిహారిక (56), పసుపునూరి శరణ్య (60), విశ్వాస్ రావు (60), లాస్య చౌదరి (75), సమీహనరెడ్డి (87)లతో కలిపిమొత్తంగా 9 మంది ప్రతిలిభ చాటారు.

State student No. 1 in NEET  Results
Author
Hyderabad, First Published Nov 2, 2021, 8:26 AM IST

హైదరాబాద్ : జాతీయ వైద్య విద్య అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)-2021 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అఖిల భారత ర్యాంకుల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ ర్యాంకుల్లో ఒకటో ర్యాంకును ముగ్గురు సాధించారు. వారిలో రాష్ట్ర విద్యార్థి మృణాల్ కుటోరి అగ్రస్థానం సొంతం చేసుకున్నారు. 

వీరు ముగ్గురూ నూటికి నూరు శాతం మార్కులు సాధించడం గమనార్హం. ఆర్మీ వైద్యుడిగా సేవలందించడం తన లక్ష్యమని, ఇష్టపడి చదివితే మంచి ర్యాంకును సొంతం చేసుకోవడం కష్టం కాదని Mrinal Kutori తెలిపారు. తర్వాత NEET రెండు స్థానాల్లోల ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి నాయర్ నిలిచారు. 

ఐదో ర్యాంకుకు 12 మంది విద్యార్థులు పోటీపడగా ఇందులో రాష్ట్రానికి చెందిన కందవల్లి శశాంక్ కూడా ఒకరు. దీంతో తొలి 10 ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు రెంటింటిని దక్కించుకున్నట్లయ్యింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు చందం విష్ణు వివేక్, గొర్రిపాటి రుషిల్ కూడా ఐదో స్థానంలో నిలిచారు.

తొలి 100 ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు కాస లహరి (30), ఈమని శ్రీనిజ (38), దసికా శ్రీనిహారిక (56), పసుపునూరి శరణ్య (60), విశ్వాస్ రావు (60), లాస్య చౌదరి (75), సమీహనరెడ్డి (87)లతో కలిపిమొత్తంగా 9 మంది ప్రతిలిభ చాటారు.

ఏపీకి చెందిన అయిదుగురి తొలి 100 ర్యాంకుల్లో నిలిచారు. గతేడాది మాదిరిగానే ఈ సారి బాలుర హవా కొనసాగింది. కేవలం 2 ర్యాంకులనే బాలికలు సొంతం చేసుకున్నారు. బాలికల విభాగంతో తొలి 21 ర్యాంకులను పరిశీలించగా తెలంగాణకు చెందిన విద్యార్థినులు ముగ్గురున్నారు. 

జాతీయ స్థాయిలో ఎయిమ్స్, జిప్ మర్ సహా అన్ని స్వయంప్రతిపత్తి వైద్య సంస్థల్లోనూ నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు. 

టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా: దీక్షా దివస్ రోజునే వరంగల్‌లో సభ

ఫలితాల్లో తీవ్ర జాప్యం...
నీట్ పరీక్షను 2021 సెప్టెంబర్ 2 దేశం మొత్తంమ్మీద 3,858 కేంద్రాల్లో నిర్వహించారు. ఫలితాలు నెల రోజుల్లోపే వెల్లడవ్వాల్సి ఉండగా.. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలో ప్రశ్నపత్రం ముందస్తుగా బయటకు వెల్లడైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐ విచారణ జరగడం, కోర్టులో కేసులు వేయడంతో ఫలితాల్లో జాప్యం జరిగింది. 

ఫలితాల వెల్లడికి గత శుక్రవారమే న్యాయస్థానం పచ్చజెండా ఊపిన క్రమంలో సోమవారం రాత్రి ఫలితాలను విడుదల చేయడంలో ఉత్కంఠకు తెరపడింది. దేశం మొత్తమ్మీద 15,44, 275 మంది పరీక్ష రాయగా.. 56.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 

ముందుగా అఖిల భారత కోటా ప్రవేశాలు...

జమ్మూ కశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి సేకరించిన 15 శాతం ఎంబీబీఎస్ సీట్లోత నిర్వహించనున్న అఖిల భారత వైద్య విద్య సీట్ల కూటమి ప్రవేశాల ప్రక్రియను తొలుగ నిర్వహిస్తారు. తెలంగాణ నుంచి అఖిల భారత కోటాకు 240 ఎంబీబీఎస్ సీట్లను అందజేస్తున్నారు. 

రాష్ట్ర ప్రవేశాలకూ, అఖిల భారత కోటాకు 240 ఎంబీబీఎస్ సీట్లను అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రవేశాలకూ, అఖిల భారత వైద్య విద్య సీట్ల కూటమి ప్రవేశాలకూ వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించే అఖిల భారత ప్రవేశాల సమాచారం కోసం అభ్యర్థులు www.mcc.nic.in వెబ్ సైట్ లో చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్దర్యంలో భర్తీ చేస్తారు. ఈ ఏడాది అఖిల భారత కోటాకు కేటాయించిన సీట్లు పోనూ.. మొత్తంగా 4,800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

గతేడాది కంటే పోటీ పెరిగింది...
పి. శంకర్ రావు, డీన్, శ్రీచైతన్య విద్యాసంస్థలు

ఈసారి నీట్ లో ఐచ్ఛికాలను ప్రశల్లో ఎంపిక చేసుకోవడాన్ని ప్రతిభావంతులు బాగా వినియోగించుకన్నారు. గతేడాది 700 మార్కులు వస్తే 100మంది పోటీలో ఉండగా.. ఈసారి అవే మార్కులకు 200 మందికి పైగా ఉన్నారు. గతేడాది 682 మార్కులకు 500వ ర్యాంకు రాగా ఈ దఫా 200 మందికి పైగా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios