తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మంత్రి జగదీష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నుంచి హుజూర్‌నగర్ టికెట్ ఆశిస్తున్న శంకరమ్మ... తనకు టికెట్ రాకుండా మంత్రి అడ్డుకుంటున్నారని.. నాలుగేళ్లుగా తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు.

కెనడా సైదిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు జగదీశ్ రెడ్డి.. తనకు టికెట్ దక్కకుండా అడ్డుకుంటున్నారని.. ఎన్ఆర్ఐ సైదిరెడ్డి మంత్రికి బినామీ అని ఆరోపించారు. గత నాలుగేళ్లలో మంత్రి అండతో నలుగురు వ్యక్తులు హుజుర్‌నగర్‌కు ఇన్‌ఛార్జులుగా వుంటూ వస్తున్నారని విమర్శించారు.

అన్ని చోట్లా సిట్టింగ్‌లకు టికెట్లు ఇచ్చారని... కానీ నాకు, కేసీఆర్, కేటీఆర్‌లు టికెట్‌ ప్రకటిస్తుంటే జగదీశ్‌రెడ్డి కావాలని అడ్డుపడి నిలిపివేశారని శంకరమ్మ మండిపడ్డారు. తనకు టికెట్ రాకుండా సైదిరెడ్డికి వస్తే.. సూర్యాపేటలోని మంత్రి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశారు.

తన మీద మంత్రి జగదీశ్ రెడ్డికి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. బీసీ మహిళ అయినందునే తన టికెట్ అడ్డుకుంటున్నారని శంకరమ్మ ఆదేవన వ్యక్తం చేశారు. మంత్రి వందల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారంటూ ఆరోపణలు చేశారు. జగదీశ్ రెడ్డికి అమరవీరుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. కేసీఆర్, కేటీఆర్‌లపై తనకు ఎనలేని గౌరవం ఉందని శంకరమ్మ చెప్పారు. 

టికెట్ నాదే, గెలుపు నాదే: టీఆర్ఎస్ నేత శంకరమ్మ ధీమా

నాకు ఇచ్చినా, అప్పిరెడ్డికి ఇచ్చినా ఓకే...ఎన్నారైకి ఇస్తే చూపిస్తా: శంకరమ్మ ఆగ్రహం

మూడు ముక్కలాట:సైదిరెడ్డికి శంకరమ్మ కొలికి, మరో నేత పోటీ

టీఆర్ఎస్ టికెట్ రాకుంటే ప్రాణత్యాగమే...ఆ మంత్రి వల్లే పెండింగ్ : శంకరమ్మ

టీఆర్ఎస్ టికెట్ రాకుంటే ప్రాణత్యాగమే...ఆ మంత్రి వల్లే పెండింగ్ : శంకరమ్మ