Asianet News TeluguAsianet News Telugu

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసు: శ్రీకాంత్ రెడ్డికి షరతులతో బెయిల్

 కీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు కేసులో అరెస్టైన శ్రీకాంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు సోమవారం నాడు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

Srikanth Reddy gets bail in keesara mro nagaraju bribe case lns
Author
Hyderabad, First Published Nov 9, 2020, 3:13 PM IST

హైదరాబాద్: కీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు కేసులో అరెస్టైన శ్రీకాంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు సోమవారం నాడు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

ఇదే కేసులో అరెస్టై బెయిల్ పై వచ్చిన శ్రీకాంత్ రెడ్డి తండ్రి ధర్మారెడ్డి ఈ నెల 8వ తేదీన కుషాయిగూడకు సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ధర్మారెడ్డికి బెయిల్ వచ్చినా శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ రాలేదు. ధర్మారెడ్డిని పోలీసులు వేధింపులకు గురి చేశారని ఆయన భార్య వెంకటమ్మ ఆరోపించారు.

also read:అన్యాయంగా కేసులో ఇరికించారు: ఆత్మహత్య చేసుకొన్న ధర్మారెడ్డి భార్య

ధర్మారెడ్డి అంత్యక్రియలకు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యేందుకు గాను ఆయన కుటుంబసభ్యులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కోర్టు  సానుకూలంగా స్ప.ందించింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

వారంలో రెండు రోజుల పాటు ఏసీబీ విచారణకు శ్రీకాంత్ రెడ్డి హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కీసర మాజీ తహసీల్దార్ గత నెల 13వ తేదీ రాత్రి నాగరాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. జైల్లోనే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెయిల్ పై వచ్చిన ధర్మారెడ్డి కూడ ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ధర్మారెడ్డి అంత్యక్రియల్లో శ్రీకాంత్ రెడ్డి పాల్గొననున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios