హైదరాబాద్: అన్యాయంగా తన భర్తను, కొడుకును ఈ కేసులో ఇరికించారని కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు కేసులో అరెస్టై ఆత్మహత్యకు పాల్పడిన  ధర్మారెడ్డి భార్య వెంకటమ్మ ఆరోపించారు.

ఆదివారం నాడు ఉదయం ఆమె ఓ మీడియాఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ కేసులో వీరిద్దరిని ఇరికించారని ఆమె ఆరోపించారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత తన భర్త ధర్మారెడ్డి మానసికంగా చాలా వేదనకు గురయ్యాడన్నారు.

బెయిల్ పై విడుదలై వచ్చినా కూడ రెండు రోజులకు ఓ సారి సంతకం పెట్టాల్సి రావడం కూడ ఆయనకు ఇబ్బందిగా మారిందన్నారు. అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ధర్మారెడ్డి మనోవేదన చెందేవాడని ఆమె చెప్పారు.

also read:నాడు నాగరాజు, నేడు ధర్మారెడ్డి: కీసర మాజీ తహాసీల్దార్ కేసులో మరో సూసైడ్

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుకు, నా భర్తకు ఎలాంటి సంబంధం లేదని వెంకటమ్మ చెప్పారు.తన భర్తను పోలీసులు వేధించారని ఆమె ఆరోపించారు.తన భర్త ఎవరో తెలియదని నాగరాజే స్వయంగా జైల్లో కలిసి తన భర్తకు చెప్పాడని  ఆమె గుర్తుచేసుకొన్నారన్నారు.

భూమి కాగితాల గురించి ఏసీబీ అధికారులు తన ఇంటికి వచ్చి గతంలో సోదాలు చేశారని ఆమె తెలిపారు. మనోవేదనకు గురైన ధర్మారెడ్డి తన ఇంటికి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడన్నారు.ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని  ఆమె కోరారు.