తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ  అంజూ యాదవ్  తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాత్రి సమయంలో ఆమెను కొట్టి  బలవంతంగా జీప్ ఎక్కించారు. 

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాత్రి సమయంలో ఆమెను కొట్టి బలవంతంగా జీప్ ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. బాధిత మహిళ ఓ హోటల్‌ నిర్వహిస్తున్నారు. అయితే మహిళ దగ్గరకు వెళ్లిన అంజూ యాదవ్.. ఆమె భర్త ఆచూకీ ఎక్కడని అడిగారు. అయితే మహిళ తెలియదని చెప్పడంతో ఆమెపై దాడి చేశారు. నడిరోడ్డుపై మహిళపై అమానుషంగా ప్రవర్తించారు. ఆమె చీర ఊడిపోయేలా దాడి చేశారు.

 తర్వాత బలవంతంగా జీప్ ఎక్కించి రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే అకారణంగా సీఐ తనపై దాడి చేశారని బాధిత మహిళ ఆరోపించారు. తన కుమారుడు వేడుకున్న పట్టించుకోకుండా దాడి చేశారని బాధితురాలు తెలిపారు. సీఐ కొంతకాలంగా తమ కుటుంబాన్ని వేధిస్తోందని మహిళ కుటుంబం ఆరోపిస్తుంది.