హైదరాబాద్: పోలీసుల విచారణ నిమిత్తం ఆత్మహత్య చేసుకున్న టీవీ సీరియల్స్ నటి శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయి కృష్ణా రెడ్డి కారులో హైదరాబాదు బయలుదేరారు. పోలీసుల పిలుపు మేరకు వారు తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి శనివారం హైదరాబాదు బయలుదేరారు. సాయి కారులో వారంతా హైదరాబాదు వస్తున్నారు. 

ఆదివారంనాడు వారు హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసుల ముందు విచారణ నిమిత్తం హాజరవుతారు. శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయి కూడా విచారణకు హాజరవుతాడు. ఇప్పటికే పోలీసులు దేవరాజు రెడ్డి విచారించారు. 

Also Read: శ్రావణితో నడిరోడ్డుపై సాయి గొడవ : సీసీటీవీ‌లో దృశ్యాలు.. పోలీసులకు కీలక ఆధారం

శ్రావణి కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు శ్రావణి కుటుంబ సభ్యులను పోలీసులు విచారణకు పిలిచారు. దేవరాజు, సాయిల వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. సాయి, శ్రావణిలకు సంబంధించిన వీడియో కూడా వెలుగు చూడడంతో సాయి పాత్రపై పోలీసులు లోతుగా విచారించే అవకాశం ఉంది.

దేవరాజు, శ్రావణి హోటల్లో భోజనం చేస్తుండగా సాయి అక్కడికి వచ్చాడని, సాయి శ్రావణిపై దాడి చేశాడని అంటున్నారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు. మరోవైపు ఆర్ఎక్స్ సినీ నిర్మాత అశోక్ రెడ్డి పాత్రపై కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. 

Also Read: సాయి, దేవరాజ్ గొడవ: ఎవర్ని ప్రేమిస్తున్నావంటే శ్రావణి చెప్పింది ఇదీ...

ఆదివారంనాడు శ్రావణి కుటుంబ సభ్యులను, సాయిని విచారించిన తర్వాత ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. దాంతో ఆదివారంనాటి విచారణ శ్రావణి ఆత్మహత్య కేసులో కీలకం కానుందని భావిస్తున్నారు.