టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆత్మహత్యకు ముందురోజు శ్రావణి, సాయి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. రోడ్డుపై శ్రావణిని సాయి బెదిరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఆత్మహత్యకు ముందురోజు శ్రావణి- సాయిల మధ్య జరిగిన వివాదం కీలకం కానుంది. శ్రావణిని సాయి సీరియస్‌గా బెదిరించినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. శ్రావణిని ఆటోలో తీసుకెళ్లేందుకు సాయి ప్రయత్నించాడు.

చివరికి ఆటో ఎక్కేందుకు శ్రావణి నిరాకరించడంతో రోడ్డుపైనే ఆమెతో గొడవ పడ్డాడు సాయి. ఈ బెదిరింపులు తట్టుకోలేక చివరికి శ్రావణి ఆటో ఎక్కినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సార్ నగర్ పోలీసుల ముందు సాయి హాజరుకానున్నాడు.  

శ్రావణిని అంత తీవ్రంగా బెదిరించే ఫుటేజ్ లభ్యం కావడంతో విచారణకు అది కీలకం కానుంది. రెస్టారెంట్‌లో సాయి తనపై దాడి చేశాడని స్వయంగా శ్రావణి చెప్పిన ఆడియో టేపు సైతం ఈ కేసులో కీలకం కానుంది.

దేవరాజ్, సాయి ఇద్దరి మూలంగా తీవ్ర మానసిక వేదనకు గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అటు సాయి, ఇటు దేవరాజు ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి ఆత్మహత్యకు కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:సాయి, దేవరాజ్ గొడవ: ఎవర్ని ప్రేమిస్తున్నావంటే శ్రావణి చెప్పింది ఇదీ....

ముందుగా సాయి ప్రేమలో ఉన్న ఆమె.. అనంతరం దేవరాజ్‌తో డైవర్ట్ చేసింది. పరిచయం పెరిగిన కొద్దిరోజులుకే అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇంట్లో వారు ఎంతగా చెప్పినా, చివరికి కేసు పెట్టినా దేవరాజుపై ప్రేమ తగ్గలేదు.

కుటుంబసభ్యులకు, సాయికి సైతం తెలియకుండా దేవరాజును కలిసేది శ్రావణి. ఓ వైపు ఇంట్లో గొడవ జరుగుతున్నా.. ఏమి తెలియనట్లుగా దేవరాజుకు కాల్ చేసి గొడవను వినిపించింది. దేవరాజ్ కూడా తెలివిగా గొడవను రికార్డ్ చేశాడు.

సుమారు అరగంట సేపు నమోదైన గొడవను రికార్డ్ చేసిన దేవరాజ్ సేఫ్‌గా ఉంచుకున్నాడు. శ్రావణి ఆత్మహత్య తర్వాత దేవరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఆ ఆడియో రికార్డ్ కూడా వెలుగులోకి వచ్చింది.