ఆదిలాబాద్ జిల్లాలో ఓ స్పోర్ట్స్ కోచ్ వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తన వద్ద శిక్షణ పొందుతున్న బాలికలపై కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉన్నతాధికారులు దృష్టికి చేరడంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. 

ఆదిలాబాద్ జిల్లాలో ఓ స్పోర్ట్స్ కోచ్ వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తన వద్ద శిక్షణ పొందుతున్న బాలికలపై కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉన్నతాధికారులు దృష్టికి చేరడంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్‎లో రవీందర్ అథ్లెటిక్స్ శిక్షకునిగా పనిచేస్తున్నాడు. అయితే అతడు తనవద్ద శిక్షణ పొందుతున్న కొందరు బాలికలతో అనుచితంగా ప్రవర్తించాడు. అయితే బాలికలు భయంతో ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. 

అయితే ఇటీవల ఓ బాలికతో కోచ్ అసభ్య చాటింగ్ చేసిన ఘటన వెలుగుచూసింది. దీంతో విద్యార్థిని బంధువులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ క్రమంలోనే మరో బాలిక కూడా తనతో కోచ్ అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. 

Also Read: కుక్క దాడిలో గాయపడిన చిన్నారి.. 40 రోజులు ప్రాణాలతో పోరాడి మృతి..

ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.. కోచ్ రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కోచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.