భేష్.. వెన్నుముక గాయంతోనే పరీక్షలు.. టెన్త్ లో 9.7జీపీఏ సాధించిన విద్యార్థి...
వెన్నుముక నొప్పి అతడి సంకల్పానికి అడ్డురాలేదు. చదువు కోవాలన్న ఆశను ఆపలేదు. విద్యాసంవత్సరం మధ్యలో ఓ ప్రమాదం అతడి వెన్నుముకను దెబ్బతీసినా.. టెన్త్ లో 9.7జీపీఏ సాధించి సత్తా చాటాడు.
హైదరాబాద్ : చదువుకోవాలన్న ఆకాంక్షకు ఎలాంటి వైకల్యమూ అడ్డు కాదని నిరూపించాడు ఆ బాలుడు. వెన్నెముకకు తీవ్ర గాయమై, నడవలేక, ఎక్కవ సేపు కూర్చోలేని స్థితిలో కూడా పదోతరగతి పరీక్షలు పట్టుదలతో రాసి 9.7 జీపీఏ తెచ్చుకున్నాడో విద్యార్థి. అతనే రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చెందిన ఆకుల అమర్‌నాథ్. అతని విజయగాథ ఏంటంటే.
వెన్నెముకకు గాయం కావడం, విద్యా సంవత్సరం మధ్యలో.. అది పదో తరగతి మధ్యలో... కొత్త పాఠశాలకు వెళ్లడం వంటివి ఆకుల అమర్‌నాథ్‌ను ఎస్‌ఎస్‌సి పరీక్షలకు హాజరుకాకుండా ఆపలేదు. వెన్నుముక నొప్పి తీవ్రంగా వేధిస్తున్నా.. ఆ నొప్పిని పంటి బిగువున భరిస్తూ పేపర్లు రాసినప్పటికీ అమర్ 9.7 జీపీఏని సాధించాడు. దీంతో శారీరక కష్టాలను అధిగమించి మనోసంకల్పం గెలిచింది.
దసరా సెలవుల్లో ఓ వర్షం కురుస్తున్న రోజు మెట్లపై నుంచి జారి పడి వెన్నెముకకు గాయం కావడంతో అమర్‌నాథ్ జీవితం మారిపోయింది. అప్పటివరకు చదువుకుంటున్న జవహర్ నవోదయ విద్యాలయం నుండి అతడిని ఈ కారణంగా తీసేశారు. అయితే, అతను విద్యా సంవత్సరం నష్టపోకుండా చూసుకోవాలనుకున్న తల్లిదండ్రులు.. నవంబర్ 2022లో స్థానిక పాఠశాలలో చేర్పించారు.
హాస్టల్‌లో ఉంటూ చదువు కొనసాగించే అవకాశం లేకపోవడంతో.. అతడిని తమకు దగ్గర్లో ఉన్న పాఠశాలలో చేర్చాలని నిర్ణయించుకున్నట్లు అమర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు శేఖర్ తెలిపారు. గాయం కారణంగా 45 రోజులకు పైగా అమర్ తరగతులకు హాజరు కాలేదు. ఒ వైపు గాయానికి చికిత్స, మరోవైపు పదో తరగతి క్లాసుల మధ్య గారడీ చేయవలసి వచ్చింది. రెండున్నర గంటలపాటు కూర్చొని పరీక్షలు రాయడం.. ఆ సమయంలో విపరీతమైన నొప్పిని భరించాల్సి రావడం కూడా సవాలుగా మారింది.
కవల ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు.. కానీ పదోతరగతిలో 10జీపీఏతో సత్తాచాటారు..
15 ఏళ్ల అమర్ నాథ్ మాట్లాడుతూ.. పాఠశాలను మార్చిన తర్వాత సీబీఎస్ సీ, ఎస్ఎస్ సి సిలబస్ లతో కూడా చాలా ఇబ్బంది పడ్డట్టు తెలిపాడు. ముఖ్యంగా తెలుగు, సాంఘిక శాస్త్రాలను చదవడానికి చాలా కష్టపడ్డానని చెప్పాడు. "మ్యాథ్స్, సైన్స్ చాలా వరకు సిలబస్ ఒకేలా ఉండటంతో సమస్య లేదు, కానీ ఇతర సబ్జెక్టులను చదవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రివిజన్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ పరీక్షలు రాసిన తర్వాత మాత్రమే నేను ఫైనల్స్ రాయగలనన్న నమ్మకం, పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తానన్న నమ్మకం రాలేదు" అని అమర్ అన్నాడు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చెందిన అమర్ మాట్లాడుతూ, కూర్చున్నప్పుడు విపరీతమైన నొప్పిని భరించాల్సి వస్తుందని, పరీక్ష రాయడం కూడా తనకు సవాలుగా మారిందని చెప్పారు."నేను పరీక్ష తర్వాత నడవలేకపోయేవాడిని, కానీ ఎలాగోలా రాయగలిగాను. అన్నారాయన. వైద్యులు అమర్‌కు వెన్నెముక శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. కానీ అది ఫెయిల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పడం వల్ల.. తల్లిదండ్రులు ఆపరేషన్ కు ఇష్టపడడం లేదు.
ఆపరేషన్ వల్ల ఃఅతని పరిస్థితి మరింత దిగజారుతుందని శేఖర్ చెప్పారు. "ఆపరేషన్ కు బదులుగా ఆయుర్వేద చికిత్సను ప్రయత్నిస్తున్నాం" అన్నారాయన. అమర్ నాథ్ ఎక్కువసేపు నడవలేడు, కూర్చోలేడు కాబట్టి ఇప్పుడు తమ ఇంటి సమీపంలోని ఇంటర్మీడియట్ కళాశాల కోసం వెతుకుతున్నామని తల్లిదండ్రులు తెలిపారు.
"నా కొడుకు సైంటిస్ట్ కావాలనుకుంటున్నాడు. కానీ కార్పోరేట్ కాలేజీలకు వెళ్లి చదువుకోలేదు. అవి ఉదయం నుండి రాత్రి వరకు నడుస్తాయి. అంత సేపు అతను కూర్చోలేడు. అందుకే, ప్రస్తుతం మాకు కావలసినది అతను విరామం లేకుండా తన విద్యను కొనసాగించడమే" అని తండ్రి చెప్పాడు.