Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటు కేసు : రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న కోర్టు

ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి ప్రత్యేక కోర్టు విచారణ కు సోమవారం హాజరు కావాల్సి ఉంది. అయితే రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీని మీద న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

special court fires on revanth reddy over cash for vote case - bsb
Author
hyderabad, First Published Feb 9, 2021, 3:39 PM IST

ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి ప్రత్యేక కోర్టు విచారణ కు సోమవారం హాజరు కావాల్సి ఉంది. అయితే రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీని మీద న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోర్టు విచారణకు నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్న నేపథ్యంలో నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, లేకపోతే అరెస్టు వారెంట్ జారీ చేస్తానని హెచ్చరించారు. 

కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంగళవారం రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయసింహాతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీ పార్వతి పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు తమకు అనుమతివ్వాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం తిరస్కరించింది. 

వాదనలు వినిపిస్తామని కోరే హక్కు లోకస్ కు అంటే చంద్రబాబుకు లేదని న్యాయమూర్తి సాంబశివరావునాయుడు స్పష్టం చేశారు.  ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు కోరుతూ లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థించారు. 

అంతేకాదు ఈ కేసులో ఇప్పటికే పలు పర్యాయాలు ఉత్తర్వులు ఇస్తామంటూ గత ఏడాదిన్నరగా న్యాయస్థానం వాయిదా వేస్తుండడంపై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios