Asianet News TeluguAsianet News Telugu

ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ కు ప్రత్యేక బస్సులు: టీఎస్ఆర్టిసి కీలక నిర్ణయం

హైదరాబాద్ ప్రజల సౌకర్యార్థం ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎఆర్టిసి  గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు ప్రకటించారు.

special buses to tankbund every sunday... tsrtc  announcement
Author
Hyderabad, First Published Sep 12, 2021, 2:51 PM IST

హైదరాబాద్: నగరవాసుల కోసం హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు ట్యాంక్ బండ్ ను తెలంగాణ సర్కార్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అయితే ఈ అందాలను ప్రశాంతంగా వీక్షించేందుకు గాను ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ట్యాంక్ బండ్ మీదుగా నిత్యం ప్రయాణించే బస్సుల రాకపోకలను కూడా ఆంక్షల సమయంలో మళ్లిస్తున్నట్లు టిఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు తెలిపారు. 
                                       
ప్రతి ఆదివారం సాయంత్రం నుండి రాత్రి వరకు సికింద్రాబాద్, రాణిగంజ్ నుండి వచ్చే బస్సులను బోట్స్ క్లబ్, మారియట్ హోటల్, డిబిఆర్ మిల్, కట్టమైసమ్మ దేవాలయం, లిబర్టీ మీదుగా వెళతాయని... సచివాలయం నుండి వచ్చే బస్సులు తెలుగు తల్లీ ఫ్లై ఓవర్, డిబిఆర్ మిల్లులు, మారియట్ హోటల్, బైబిల్ హౌస్, రాణి గుంజ్ నుండి మళ్లించబడతాయని తెలిపారు.  

read more  ఇకపై ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు... టైమింగ్స్ ఇవే, హైదరాబాద్ సీపీకి కేటీఆర్ సూచన

అలాగే ట్యాంక్‌బండ్‌కు వచ్చే ప్రజల సౌకర్యార్థం టి.ఎస్.ఆర్టీసీ ప్రతి ఆదివారం సాయంత్రం 4.00 నుండి ప్రత్యేక బస్సులను నడుపుతుంది తెలిపారు.గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలకు రాత్రి 10.30 గంటల నుండి ట్యాంక్‌బండ్ నుండి బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios