ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు తేవాలని, నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీకి మంత్రి కేటీఆర్ సూచించారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ విధించాలని ఆయన తెలిపారు.  

హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ట్యాంక్‌బండ్‌పై ఆదివారాల పూట సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని మంత్రి కేటీఆర్‌ పోలీసు కమిషనర్‌కు సూచించారు. హైదరాబాద్ వాసుల ట్విట్టర్‌ విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు తేవాలని, నగరవాసుల సందర్శనకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని సీపీకి సూచించారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ విధించాలని తెలిపారు. ట్యాంక్‌బండ్ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు.