హైద్రాబాద్ మన్నెగూడలో ఆర్టీఓ  కార్యాలయంలో నకిలీ ఆర్టీఓతో ఆయనకు సహకరిస్తున్న ఆరుగురిని  ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్: నగరంలోని మన్నెగూడ ఆర్టీఓ కార్యాలయంలో బుధవారంనాడు ఉదయం ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. నకిలీ ఆర్టీఓ అధికారితో పాటు ఆయనకు సహకరిస్తున్న ఆరుగురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కంప్యూటర్లు, నకిలీ సర్టిఫికెట్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ పత్రాలతో వాహనాల ఇన్సూరెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా ఎస్ఓటీ పోలీసులు ఇవాళ మన్నెగూడ ఆర్టీఓ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ ముఠా ఇప్పటివరకు ఎన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసింది, ఎన్ని వాహనాలకు ఇన్సూరెన్స్ చేసిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.