హయత్ నగర్ కి చెందిన బీఫార్మసీ విద్యార్థిని సోని  ఇటీవల కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసు విషయంలో పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నాపర్ ఎవరు ఏంటి అన్న విషయాలను తెలుసుకోగలిగారు. ఈ కేసు విచారణలో భాగంగా కిడ్నాపర్ పేరు శ్రీధర్ రెడ్డి కాదని.. రవి అని తెలుసుకున్న పోలీసులు అతనిది విజయవాడ అని గుర్తించారు.

అయితే ఈ కేసులో మరో కీలక విషయాన్ని కూడా పోలీసులు కనుగొన్నారు. సోనిని కిడ్నాప్ చేయడానికి ముందు అతను ఓ కారును కూడా దొంగతనం చేసినట్లు గుర్తించారు. కారు యజమాని ఫిర్యాదుతో నిందింతుడి గుర్తింపు సులభంగా మారిందని పోలీసులు చెప్పారు. నిందితుడు పలు పాతకేస్థుల్లో నేరస్థుడని...మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పారు. 

కాగా పోలీసులు కేసును మరింత వేగవంతం చేశారు. నాలుగు రోజులు గడుస్తున్నా తమ కూతురి ఆచూకీ లభించకపోవడంతో సోని తల్లిదండ్రులు ఆందోళనకు గురౌతున్నారు.