హైదరాబాద్: వారం రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన సోనిని కిడ్నాపర్ రవి ప్రకాశం జిల్లా అద్దంకిలో మంగళవారం నాడు వదిలిపెట్టాడు. ఈ మేరకు పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

అద్దంకి నుండి సోనిని హయత్ నగర్ కు పోలీసులు తీసుకువస్తున్నారు. వారం రోజుల క్రితం సోనిని రవి అనే వ్యక్తి సోనిని కిడ్నాప్ చేశాడు. అద్దంకి పోలీసులు సోని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అద్దంకి నుండి సోని హయత్ నగర్ కు బయలుదేరింది.

సోనిని కిడ్నాప్ చేసిన రవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు పోలీసు టీమ్ లు కిడ్నాపర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కిడ్నాపర్ రవిశంకర్ తెలంగాణలో తిరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.

 నల్గొండ జిల్లాలోని ఎరువుల దుకాణంలో విజిలెన్స్ అధికారిని అంటూ రూ.90 వేలు వసూలు చేసి పారిపోయాడు.రవిశంకర్ కోసం పోలిసులు ఏపీ, బెంగుళూరులలో గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలోనే నల్గొండ జిల్లాలో విజిలెన్స్ అధికారి అవతారమెత్తాడు.

వారం రోజుల పాటు సోనిని రవిశంకర్ ఎక్కడెక్కడ ఉంచాడు. ఎక్కడెక్కడకు తిప్పాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. సోనిని తీసుకొని పోలీసులు ఆయా ప్రదేశాల్లో తిప్పి సమాచారాన్ని పోలీసులు సేకరించనున్నారు.

మంగళవారం తెల్లవారుజామున సోనిని అద్దంకి బస్టాండ్ లో సోనిని కిిడ్నాపర్ రవిశేఖర్ వదిలిపెట్టాడు. రవిశేఖర్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ఆధారంగా పోలీసులు రవిశేఖర్  ను వెంబడిస్తున్నారు. పోలీసులు తనను వెంబడిస్తున్నారని భావించిన రవిశేఖర్  సోనిని వదిలేసి పారిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు.. నిందితుడిని గుర్తించిన పోలీసులు