మరో మహిళతో సహ జీవనం, టెక్కీని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొన్న ఫస్ట్ భార్య

Sofware engineer cheats wife, caught red-handed in Hyderabad
Highlights

టెక్కీ రాసలీలలు


హైదరాబాద్: ప్రేమించి పెళ్ళి చేసుకొన్న  భార్యను కాదని మరో  మహిళతో సహజీవనం చేస్తున్న  టెక్కీని మొదటి భార్య బంధువులు  రెడ్ హ్యండెడ్ గా పట్టుకొన్న ఘటన గురువారం నాడు హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు  నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.

రాజమండ్రికి చెందిన రమణి, అనిల్ శేషుకుమార్  ప్రేమించి పెద్దలను  ఒప్పించి  2009లో వివాహం చేసుకొన్నారు. వీరికి ఓ పాప కూడ ఉంది.  కొంత కాలం వరకు వీరి కాపురం బాగానే ఉంది.  అయితే రమణిని ఆస్థిలో వాటా అడగాలని  అనిల్ ఒత్తిడి చేసేవాడని  రమణి సోదరులు చెబుతున్నారు. 

అయితే  ఈ విషయమై పెద్ద మనుషుల మధ్య ఒప్పందం జరిగినా పట్టించుకోలేదన్నారు. ఆఖరుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తే  కాపురానికి తీసుకెళ్తానని చెప్పి తప్పుడు అడ్రస్ ఇచ్చి  2013 నుండి కన్పించకుండా పోయారని రమణి సోదరులు చెబుతున్నారు.

అయితే అప్పటి నుండి అనిల్ శేషుకుమార్ కోసం  రమణి కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. అయితే అయితే  తాను పనిచేసే కార్యాలయంలోనే పనిచేసే ప్రత్యూష అనే మరో ఉద్యోగినితో 2013 నుండే అనిల్ కు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై అనిల్ తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోలేదని రమణి సోదరులు ఆరోపిస్తున్నారు. అయితే  ఈ కాలంలో ఇద్దరు భార్యలు సహజమేనని అనిల్ తల్లి ప్రోత్సహించిందని వారు ఆరోపిస్తున్నారు.

అయితే  నాలుగేళ్ళుగా అనిల్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తే  హైద్రాబాద్ చైతన్యపురిలోని ఓ ఇంట్లో ప్రత్యూషతో  సహజీవనం చేస్తున్న విషయాన్ని రమణి కుటుంబసభ్యులు గుర్తించారు. గురువారం నాడు ఉదయాన్నే అనిల్ నివాసం ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చి అనిల్ పై దాడి చేశారు.  ప్రత్యూషకు  , అనిల్ కు ఇప్పడు ఇద్దరు పిల్లలు. రెండు నెలల క్రితమే రెండో బిడ్డకు ప్రత్యూష జన్మనిచ్చింది.

ఈ విషయమై అనిల్‌పై రమణి కుటుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిల్ కు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇదిలా ఉంటే తాము వివాహం చేసుకోలేదని అనిల్ తో సహజీవనం చేస్తున్న ప్రత్యూష మీడియాకు తెలిపారు.  తనను అనిల్ మోసం చేశారని ఆమె ఆరోపించారు. పెళ్ళైన విషయం తెలుసునని చెప్పారు.  కానీ, విడాకులు వస్తాయని నమ్మించి తనతో సహాజీవనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 

loader