Asianet News TeluguAsianet News Telugu

సాఫ్ట్‌వేర్ శారదకు అండగా నిలిచిన టీటా గ్లోబ‌ల్...అంత‌ర్జాతీయ స్థాయి అవకాశం (వీడియో)

ఆక‌ర్ష‌ణీయ‌మైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఆక‌స్మికంగా పోయిన‌ప్ప‌టికీ రెట్టించిన ఉత్సాహంతో త‌న కుటుంబం నిర్వ‌హిస్తున్న కూర‌గాయ‌ల వ్యాపారంలో భాగ‌స్వామ్యం పంచుకుంటూ వార్త‌ల్లో నిలిచిన టెక్కీ శార‌ద‌కు తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) గొప్ప అవ‌కాశం క‌ల్పించింది. 

software professionals body reaches out to IT professional Sharada
Author
Hyderabad, First Published Aug 3, 2020, 6:52 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైద‌రాబాద్‌: ఆక‌ర్ష‌ణీయ‌మైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఆక‌స్మికంగా పోయిన‌ప్ప‌టికీ రెట్టించిన ఉత్సాహంతో త‌న కుటుంబం నిర్వ‌హిస్తున్న కూర‌గాయ‌ల వ్యాపారంలో భాగ‌స్వామ్యం పంచుకుంటూ వార్త‌ల్లో నిలిచిన టెక్కీ శార‌ద‌కు తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) గొప్ప అవ‌కాశం క‌ల్పించింది. అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానానికి సంబంధించిన అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణను ఒక్క రూపాయి ఖ‌ర్చులేకుండా ఆమెకు అంద‌జేసేందుకు టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల నిర్ణ‌యించారు. ఈ మేర‌కు నేడు ఈ శిక్ష‌ణ ప‌త్రాన్ని అంద‌జేశారు. దీంతో పాటుగా టెక్కీ శార‌ద‌కు ఉచితంగా ల్యాప్‌ట్యాప్ అంద‌జేశారు. 

ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఉద్యోగాలు కోల్పోతున్న వారు శార‌ద‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలని సందీప్ మ‌క్తాల పిలుపునిచ్చారు.వ‌ర్చుసా ఐటీ కంపెనీలో కీల‌క‌మైన స్థానంలో ఉద్యోగం చేస్తున్న టెక్కీ శార‌ద అనూహ్య ప‌రిణామాల నేపథ్యం‌లో కొలువును కోల్పోవ‌డం, ఉద్యోగం పోయిన‌ప్ప‌టికీ ధైర్యం కోల్పోకుండా త‌ల్లిదండ్రులతో క‌లిసి కూర‌గాయ‌లు అమ్ముకునే వ్యాపారంలో పాలు పంచుకోవ‌డం పెద్ద ఎత్తున వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. 

తెలంగాణ‌లోని ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్న టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల‌ ఈ ప‌రిణామం అనంత‌రం ఆమెను సంప్ర‌దించారు. ఆమె చేసిన ఉద్యోగం, క‌లిగి ఉన్న నైపుణ్యాల గురించి తెలుసుకొని శార‌ద‌కు ఆర్థిక స‌హాయం అందించ‌డం కంటే, నైపుణ్యాలు అందించి కొత్త ఉద్యోగం సాధించేందుకు స‌హ‌క‌రించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ మేర‌కు టీటా త‌ర‌ఫున కృత్రిమ మేధ‌స్సులో ఉచితంగా శిక్ష‌ణ అందించ‌నున్నారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్స‌స్ ఎట్ డ‌ల్ల‌స్‌ ద్వారా అందించే శిక్ష‌ణ అనుమ‌తి ప‌త్రం ఇచ్చారు. 

read more   సోను సూద్ ఉదారత: వరంగల్ సాఫ్ట్ వేర్ శారదకు సాయం

ఈ అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌ను ఉచితంగా అందించడంతో పాటుగా ల్యాప్ టాప్ సైతం టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ అందించారు. త‌న కూర‌గాయ‌ల వ్యాపారం నిర్వ‌హించుకుంటూనే నేర్చుకునేలా ఈ ల్యాప్ టాప్‌ ఎంతో స‌హాయ‌కారిగా ఉండ‌నుంది.

ఈ సంద‌ర్భంగా సందీప్ మ‌క్తాల మాట్లాడుతూ... ఐటీ రంగంలోని వారు ఉద్యోగం తొల‌గించ‌బ‌డితే (లే ఆఫ్‌)కు గురైన వారు తీవ్ర‌మైన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతారని, ఇదే రీతిలో పొగాకు హ‌రిణి అనే టెక్కీ ఉద్యోగిని గ‌త ఏడాది క‌న్నుమూసిన ఉదంతం అనేక మందిని క‌ల‌చి వేసింద‌న్నారు. ఉద్యోగాలు కోల్పోతున్నామ‌ని ఆందోళ‌న చెంద‌వ‌ద్దని, అందుబాటులో ఉన్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆచ‌ర‌ణ‌లో చాటిచెపుతూ శారద అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోందని తెలిపారు. 

వీడియో

"

త‌మవంతుగా ఈ టెక్కీకి అండ‌గా నిలవ‌డంలో భాగంగా ఆమెకు ఉచితంగా శిక్ష‌ణ ఇవ్వ‌డంతో పాటు ల్యాప్ టాప్ అందించిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ నైపుణ్యాలు పెంచుకోవాలని, ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ ఆలోచ‌న‌లు పెంచుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, సైబ‌ర్ సెక్యురిటీ, బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీ వంటి వాటిపై ప‌ట్టు సాధించాల‌ని సందీప్ మ‌క్తాల కోరారు. 

ఆన్‌లైన్‌లో క‌నెక్ట్ అయిన‌ టీటా అమెరికా సెక్ర‌ట‌రీ మ‌నోజ్ తాటికొండ ఎన్నారైల త‌ర‌ఫున, త‌న వంతు వీలైనంత వ‌ర‌కు శిరిష‌కు ఎలాంటి స‌హాయం అయినా అందిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా టీటా అధికారిక ప్రతినిధి వెంకట్ వనం, టీటా స‌భ్యులు మ‌హ్మ‌ద్ ఇలియాస్‌, హారిక త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios