కరోనా వైరస్ దెబ్బకు ఆర్థికంగా ప్రపంచం కుదేలయింది. సామాన్యులు చాలా కష్టాలు పడుతున్నారు. ఉద్యోగాలను కోల్పోయి రోడ్డునపడుతున్నారు. చాలా మంది దిక్కుతోచని పరిస్థితుల్లో భారంగా బ్రతుకును వెళ్లదీస్తున్నారు. 

ఇలానే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కు చెందిన శారద సైతం ఈ కరోనా దెబ్బకు తన సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. ఉద్యోగం పోవడంతో ఇంటికి వచ్చింది. 60 సంవత్సరాలున్న తండ్రి ఈ కాలంలో బయటకు వెళ్లడం మంచిది కాదు అనుకోని తన సోదరుడితో కలిసి తండ్రి కూరగాయల వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. 

వరంగల్ కి చెందిన శారద ఎటువంటి భేషజాలకు పోకుండా తన తండ్రి కూరగాయల వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రచురితమైన కథనానికి ఎందరో ప్రజా ప్రతినిధులు సైతం స్పందించారు. ఎర్రబెల్లి వంటి అమాత్యులు సహాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. తాజాగా శారద విషయం తెలుసుకున్న రియల్ లైఫ్ హీరో సోను సూద్ శారదకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. 

లాక్ డౌన్ సమయంలో ఎంతో మందిని బస్సులని, విమానాలను ఏర్పాటు చేసి వారిని వారి సొంత గ్రామాలకు చేర్చాడు. తాజాగా సాఫ్ట్‌వేర్‌ శారదకు సహాయం చేసేందుకు ముందుకువచ్చాడు.  ఆమె ఫోన్ నెంబర్ వివరాలు అడిగి తెలుసుకున్న సోనూసూద్ ఆమెకి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇకపోతే... సొంత గ్రామాలకు వెళ్లే ప్రయత్నంలో మరణించిన 400ల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయనున్నట్టుగా ప్రకటించాడు సోనూ. తాజాగా ఈ విలక్షణ నటుడు తెలుగు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ వల్ల కష్టాలు పడుతున్న ఓ కుటుంబానికి సాయం చేసేందుకు రెడీ అయ్యాడు. గత రెండు రోజులు చిత్తూరు జిల్లాలోని ఓ కుటుంబానికి సంబంధించిన వార్త మీడియాలో వైరల్‌ అయ్యింది.

పొలం దున్నేందుకు ఎద్దులు లేకపోవటంతో ఇద్దుు బాలికలు కాడి లాగుతూ పొలం దున్నుతున్న వీడియో వైరల్ కావటంతో ఆ వీడియో సోనూ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించి సోనూ, వారికి ముందుగా రెండు ఎద్దులు అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే కొద్ది సేపటికి వారి కష్టాలు తీరటానికి ఎద్దులు సరిపోకపోవవటంతో ఓ ట్రాక్టర్‌ను వారికి అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. దీంతో మరోసారి సోనూ పేరు మోగిపోతోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా సోనూ సాయం అధించటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.